హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీ భ‌వ‌న్ లో ర‌గిలిన విద్వేషాలు..! కార్య‌క‌ర్త‌ల మ‌ద్య భీక‌ర పోరు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

రణరంగంగా మారిన గాంధీ భవన్‌...!! | Oneindia Telugu

హైద‌రాబాద్ : ప్ర‌శాంతంగా ఉండే గాంధీ భ‌వ‌న్ ప‌ర‌స్ప‌ర దాడుల‌తో ద్ద‌రిల్లి పోయింది. ఎన్నిక‌లు, సీట్ల పంచాయితీ అన్నీ అయిపోయాయి, ఇప్పుడెందుకు గొడ‌వ‌లు అనుకుంటున్నారా..? అది కాంగ్రెస్ పార్టీ..! గొడ‌వ‌లు వ‌ర్గ విభేదాలు ఎప్పుడైనా ప్ర‌ళ‌య తాండవం చేయొచ్చు. ఇదే క్ర‌మంలో గాంధీ భ‌వ‌న్ లో ఎవ్వ‌రూ ఊహించ‌ని అకాల వ‌ర్షం లాగా నేత‌లు మ‌ద్య ముష్టి యుద్దం జ‌రిగింది. దీంతో అక్క‌డే ఉన్న ఇత‌ర నేత‌ల ఉలిక్కి ప‌డ్డారు. దీంతో గాంధీ భ‌వ‌న్ ప‌రిస‌ర ప్రాంతాలు ఒక్క‌సారిగా ఉత్రిక్తంగా మారిపోయాయి. వివాదం ముదిరి విష‌యం పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కు వెళ్లింది. ఇంత‌కి ఎవ‌రిమ‌ద్య గొడ‌వ‌..? త‌న్నుకుందెవ‌రు..? తెలుసుకుందాం..!!

Gandhi Bhavan like battlefield..! Fighting between the leaders..!!

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో అంబ‌ర్ పేట నుండి పోటీ చేయాల‌ని భావించిన శ్రీ‌కాంత్ కు, టికెట్ రాకుండా పార్టీ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు అడ్డుకున్నాడ‌ని ఆరోపిస్తూ, శ్రీ‌కాంత్ వ‌ర్గీయులు, వీహెచ్ వ‌ర్గీయుల పై మెరుపు దాడికి పాల్ప‌డ్డారు. గాంధీ భ‌వ‌న్ లో ఓ స‌న్మాన కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వి. హ‌నుమంత‌రావును చూసి శ్రీ‌కాంత్ వ‌ర్గీయులు రెచ్చి పోయారు. త‌న‌కు టికెట్ విష‌యంలో అన్యాయం చేసిన వి. మ‌నుమంత‌రావును ఉపేక్షించేది లేద‌ని శ్రీ‌కాంత్ వ‌ర్గం ప్ర‌త్య‌క్ష దాడికి ఉప‌క్ర‌మించింది. అక్క‌డే ఉన్న విహెచ్ అనుచ‌రులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా శ్రీ‌కాంత్ వ‌ర్గం రెచ్చ‌పోయింది. విహెచ్ క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే అంటూ బీతాబ‌హ వాతావ‌ర‌ణాన్ని స్రుష్టించారు. అంతే కాకుండా వీహెచ్ సైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బేగం బ‌జార్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు కూడా చేసారు. ఐతే జ‌రిడిన సంఘ‌ట‌న ప‌ట్ల విహెచ్ స్పందించారు. పార్టీలో త‌న‌కు కూడా అన్యాయం జ‌రిగింద‌ని, తాను ఎవ‌రికి చెప్పుకోవాల‌ని ప్ర‌శ్నించారు. త‌న‌పై జ‌రిగిన దాడి రేపు పీసీసీ, ఎఐసీసీ స్థాయిలో జ‌రిగితే ఎవ‌రు బాద్యుల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

English summary
Srikanth, who was supposed to contest from Amberpet in the last elections in Telangana, said senior party leader allegation that Hanumantha Rao hindered, the Srikant community and the VH followers were attacked in Gandhi bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X