హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీ ఆస్పత్రికి మాయరోగం, టిక్కుటక్కుల్లో జూడాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మొన్న ఖమ్మం కార్పొరేషన్‌లో విధులు నిర్వహించకుండా టిక్కు టక్కులో మునిగితేలారు ఉద్యోగులు. సేమ్ సిచుయేషన్ గాంధీ దవాఖానకు పాకింది. అక్కడ ఉద్యోగుతైలే ఇక్కడ వైద్యులు. రోగులను చూసుకోవాల్సిన డాక్టర్లు తమ సొంత పనుల్లో మునిగితేలారు. అదీ కూడా క్షణికానందం కోసం టిక్ టాక్ వీడియోలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవడంతో ఎట్టకేలకు సూపరింటెండెంట్ స్పందించారు.

 టిక్ టాక్‌లో మునిగారు

టిక్ టాక్‌లో మునిగారు

రాష్ట్రంలో పెద్దాసుపత్రి గాంధీ దవాఖాన. ఇక్కడికొచ్చేవారు పేదలు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని ప్రభుత్వ పెద్దలు బీరాలు పలుకుతారు. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా కొనసాగుతుంది. గాంధీ ఫిజియోథెరపీ వార్డులో వైద్యులు చేసిన టిక్ టాక్ సంచలనం కలిగించింది. రోగులను చూసుకోవాల్సిన వైద్యులు .. వారిని మరచి తమ ఫోనులో టిక్ టాక్ చేశారు. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలైంది. దీంతో గాంధీ సూపరిండెంట్ స్పందించారు.

రోగులంటే పట్టదా ..?

రోగులంటే పట్టదా ..?

గాంధీ ఆస్పత్రిలోని ఫిజియోథెరపి విభాగంలో రోగులు ఉన్నారు. వారితోపాటు వైద్యులు కూడా ఉన్నారు. ఫిజియోథెరపీ అంటేనే శరీరంలోని ఆయా అవయానికి మసాజ్ చేయ్యడం. కానీ గాంధీ ఫిజియోథెరపీలో మాత్రం జూనియర్ డాక్టర్లు టిక్ టాక్‌లో మునిగిపోయారు. రోగులు ఉన్నారనే సంగతినే మరచిపోయారు. తమ పనిలో లీనమైపోయారు. రోగులకు వైద్యం కాదు కాదు .. సేవ చేయాల్సిన డాక్టర్లు వైద్యవృత్తికే కళంకం తెచ్చేటట్టు ప్రవర్తించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గాంధీ ఆస్పత్రి వర్గాలు కుంటిలో మెల్ల అన్నట్టు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అందులో వారు తమ విద్యార్థులు కాదని తమను తాము తప్పించుకునే ప్రయత్నం చేశారు.

దిద్దుబాటు చర్యలు ..

దిద్దుబాటు చర్యలు ..

అయితే ఈ విషయం వైరలవడంతో గాంధీ ఆస్పత్రి వర్గాలు స్పందించాయి. ఆస్పత్రిలో ఘటన జరిగితే తమకేమీ సంబంధం లేదని కొత్తభాష్యం చెప్పాయి. అదేంటి అని అడిగితే ఆ జూనియర్ డాక్టర్లతో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఇదేంటి అని నిలదీస్తే వారిద్దరూ ఫిజియోథెరఫి ఇంటెర్న్ షిప్ చేస్తున్న విద్యార్థులని గాంధీ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. వారు తమ విద్యార్థులు కాదని చెప్పి .. తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఘటన జరిగింది గాంధీ దవాఖానలో కదా అనే విషయాన్ని మాత్రం మరచిపోయారు. ఈ ఘటనపై ఫిజియోథెరపి డిపార్ట్‌మెంట్ ఇంచార్జీకి నోటీసులు జారీచేశారు. ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.

English summary
Gandhi hospital in big in the state. poor people come to here. but hospital crew are busy in tik tok vedio. Doctors to look after patients .. Forget them and tick on their phone. However, the video went viral with the sharing on social media. The superintendent of Gandhi responded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X