హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేద రోగుల పాలిట వరం : గాంధీ ఆస్పత్రిలో ఇకనుంచి అవయవ మార్పిడి ..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పేదోడికి పెద్ద రోగమొస్తే ప్రభుత్వాసుపత్రులే దిక్కు. కానీ వాటిలో అవయవ మార్పిడి చికిత్స చేసే వెసులుబాటు ఉండదు. సంబంధిత చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించాల్సిందే. అయితే వారు ముక్కుపిండి ఫీజు వసూల్ చేయనుండంతో .. ప్రైవేట్ ఆస్పత్రికి పోలేక, సర్కార్ దవాఖానలో వైద్యం చేయించుకోలేని పరిస్థితి. అయితే క్షేత్రస్థాయిలో పేదల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం .. సర్కార్ దవాఖానల్లో అవయవ మార్పిడి చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

ఒకే దేశం .. ఒకే కార్డు ... దేశవ్యాప్తంగా రేషన్ కోసం కేంద్రం కసరత్తు .. ఒకే దేశం .. ఒకే కార్డు ... దేశవ్యాప్తంగా రేషన్ కోసం కేంద్రం కసరత్తు ..

గాంధీలో అవయవ మార్పిడి ..

గాంధీలో అవయవ మార్పిడి ..

కిడ్నీ, లివర్, హర్ట్, లాంగ్స్ తదితర ముఖ్య అవయవ మార్పిడిలను ప్రభుత్వాసుపత్రుల్లో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అత్యాధునిక సౌకర్యాలతో గాంధీ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్పత్రి 8వ అంతస్తులో 8 ఆధునిక ఆపరేషన్ థియేటర్ల కోసం గదులను నిర్మిస్తామని స్పష్టంచేసింది. ఇందుకోసం ఆరోగ్య శ్రీ ట్రస్ట్ నుంచి రూ.35 కోట్లు వినియోగించాలని నిర్ణయం తీసుకుంది.

ఇక్కడే ఎందుకంటే ...

ఇక్కడే ఎందుకంటే ...

వాస్తవానికి గాంధీ ఆస్పత్రితోపాటు నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రులను కూడా పరిశీలించింది. అయితే ఉస్మానియాలో ఇప్పటికే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు చేస్తున్నారు. అయితే ఆపరేషన్ థియేటర్ పునర్ నిర్మించాలి. కానీ అక్కడ భవనం శిథిలావస్థకు చేరడంతో .. కొత్త గదుల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. ఇటు నిమ్స్‌లో కూడా నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే ఇప్పటికే అక్కడ రెండు మ్యాడులర్ థియేటర్లు ఉన్ానయి. వీటిలో ఎక్కువగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో హార్ట్, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే కిడ్నీకి సంబంధించిన శస్త్రచికిత్స జరుగుతున్నందన మరో చోట నిర్మిస్తే మేలు అనే అభిప్రాయంతో గాంధీలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఇప్పటికే కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు జరుగుతుండడం .. మహిళలు, పిల్లలకు సంబంధించిన విభాగాలు అందుబాటులో ఉండటంతో ఇక్కడే నిర్మించాలని ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది.

పేదలకు మేలు ..

పేదలకు మేలు ..

గాంధీలో ఆపరేషన్ థియేటర్ల నిర్మాణంతో అవయవ మార్పిడికి అవసరమైన ఆధునిక శస్త్రచికిత్స గదులు ఒకేచోట అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం దాదాపు రూ.15 లక్షలు ఖర్చవుతుంది. అదే లివర్ అయితే రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు అవుతుంది. ప్రభుత్వం అత్యాధునిక శస్త్రచికిత్స గదులను తీసుకురావడంతో తక్కువ వ్యయంతో రోగులకు అవయవ మార్పిడి చేయొచ్చు. అంతేకాదు ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ఆరోగ్యశాఖ భావిస్తోంది.

ఇలా నిర్మాణం ..

ఇలా నిర్మాణం ..

గాంధీ ఆస్పత్రి ఎనిదో అంతస్తులో ఉన్న లక్ష చదరపు అడుగులు విస్తీర్ణాన్ని విభజించి .. వేర్వేరు అవయవ మార్పిడి ఆపరేషన్ల నిర్వహణకు అనుగుణంగా గదులను నిర్మిస్తారు. ప్రతి ఆపరేషన్ థియేటర్‌కు అనుంబంధంగా మినీ ఐసీయూ, శస్త్రచికిత్సకు ముందు సిద్ధం చేసే గదిని, ఆపరేషన్ తర్వాత పర్యవేక్షణ గదిని నిర్మిస్తారు. అయితే గాంధీ 8వ అంతస్తులో ఉన్న నర్సింగ్ స్కూల్ సికింద్రాబాద్‌లోని బోయిగూడలో భవనానికి .. ఫల్మనాలజీ విభాగాన్ని గాంధీ ఐదో అంతస్తుకు మారుస్తారు.

English summary
The Telangana government hopes to organize major organ transplants such as Kidney, Liver, Hurt, and Lung. For this purpose Gandhi hospital is making arrangements with state-of-the-art facilities. The hospital has made it clear that it will build rooms for 8 modern operation theaters on the 8th floor. For this purpose, it has been decided to utilize Rs.35 crores from aarogya sri Trust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X