హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీలో మరో దారుణం.. కరోనా పేషెంట్ డెడ్ బాడీ మాయం.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం..

|
Google Oneindia TeluguNews

గాంధీ ఆస్పత్రి చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఓవైపు సదుపాయాలు,సౌకర్యాలు సరిగా లేవని అక్కడ చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆడియో టేపులు లీకవడం ఆందోళన రేకెత్తిస్తుండగా.. మరోవైపు గాంధీపై ఒత్తిడి పెరుగుతోందంటూ జూడాలు నిరసనలకు దిగడం కూడా ప్రజలను కలవరపెడుతోంది. ఈ వివాదాలు ఇలా కొనసాగుతుండగానే.. గాంధీ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కూడా వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. ఇటీవలే ఒకరి మృతదేహానికి బదులు మరొకరి మృతదేహాన్ని అప్పగించి అభాసుపాలైన గాంధీ సిబ్బంది.. తాజాగా మరోసారి అలాంటి తప్పిదమే చేశారు.

డెడ్ బాడీ మాయం..

డెడ్ బాడీ మాయం..

హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన రషీద్(37) అనే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో మంగళవారం(జూన్ 9) గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో అతని మృతదేహాన్ని గాంధీ సిబ్బంది మార్చురీలో భద్రపరిచి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే తీరా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చాక రషీద్ మృతదేహం కనిపించలేదు. దీంతో డెడ్ బాడీ ఏమైందన్నది వారికి అంతుచిక్కలేదు.

కడసారి చూపుకు నోచుకోనివ్వకుండా

కడసారి చూపుకు నోచుకోనివ్వకుండా

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాంధీ సిబ్బందిని వారు విచారించారు. విచారణలో పలు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. పొరపాటున రషీద్ మృతదేహాన్ని మరొకరికి ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు,బుధవారమే వారు అంత్యక్రియలు కూడా నిర్వహించినట్టు నిర్దారించారు. దీంతో రషీద్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కనీసం కడసారి చూపుకు కూడా నోచుకోనివ్వకుండా చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఓ డెడ్ బాడీ తారుమారు..

ఇటీవల ఓ డెడ్ బాడీ తారుమారు..


ఇటీవల మరో పేషెంట్ డెడ్ బాడీ అప్పగింతలోనూ గాంధీలో ఇలాంటి తప్పిదమే జరిగింది. హైదరాబాద్‌లోని బేగంపేట గురుమూర్తినగర్‌కు చెందిన ఓ కరోనా పేషేంట్ (48) గాంధీ ఆస్పత్రిలో ఇటీవల మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులను పిలిచి డెడ్ బాడీని అప్పగించారు. అయితే అంత్యక్రియల కోసం డెడ్ బాడీని శ్మశాన వాటికకు తరలించగా.. కడసారి చూపు కోసం అతని భార్య డెడ్ బాడీ ముఖం చూసింది. అది తన భర్త డెడ్ బాడీ కాదని గుర్తించింది. దీంతో హుటాహుటిన ఆ డెడ్ బాడీని అంబులెన్సులో గాంధీకి తరలించారు. ఆగ్రహంతో డాక్టర్లు,హెల్త్ కేర్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అయితే మార్చురీలో ఆ వ్యక్తి డెడ్ బాడీ ఉండటంతో శాంతించారు.పని ఒత్తిడి కారణంగానే ఇలా జరుగుతోందని సిబ్బంది వాపోతుండటం గమనార్హం.

English summary
In a shocking incident,Gandhi hospital staff handed over wrong dead body to a family in Hyderabad. They identified it as some other dead body at graveyard
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X