హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐదు డిమాండ్లు ఇవే.. ప్రభుత్వం తేల్చాల్సిందే అంటున్న గాంధీ జూడాలు..

|
Google Oneindia TeluguNews

పూర్తి స్థాయి కోవిడ్-19 ఆస్పత్రిగా ఉన్న సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం(జూన్ 9) రాత్రి వైద్యులపై మరోసారి దాడి జరగడంతో.. జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. నిన్న రాత్రి నుంచి విధులు బహిష్కరించిన సుమారు 300 మంది జూడాలు నిరసనను కొనసాగిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వైద్యుల రక్షణకు భరోసా ఇచ్చే ఐదు డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు పెట్టారు.

జూడాల డిమాండ్లు ఇవే..

జూడాల డిమాండ్లు ఇవే..

రాష్ట్రంలో ఎక్కడ కరోనా పాజిటివ్ కేసు నమోదైనా ఆ పేషెంట్‌ను గాంధీ ఆస్పత్రికే తరలిస్తున్నారు. దీంతో ఆస్పత్రిపై ఒత్తిడి తీవ్రమవుతోంది. దీన్ని తగ్గించాలంటే ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కరోనా చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని జూడాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కొత్త వైద్యుల నియామకాన్ని చేపట్టాలని.. తద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యులపై భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

జూడాల డిమాండ్లు..

జూడాల డిమాండ్లు..


ప్రస్తుతం పనిచేస్తున్న జూనియర్ వైద్యుల్లో పీజీ పూర్తి చేస్తున్నవారిని సీనియర్ రెసిడెంట్స్‌గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గతంలో వైద్యులపై దాడి జరిగినప్పుడు ఎలాంటి శిక్షలు అమలుచేశారు.. ఇకముందు దాడులకు పాల్పడితే ఎలాంటి శిక్షలు అమలుచేస్తారో అందరికీ తెలిసేలా భారీ ప్రచారం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఐదు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని.. లేనిపక్షంలో వైద్య వృత్తిలో తమకు రక్షణ కరువవుతుందని వాపోతున్నారు. ఈ డిమాండ్లను ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, గాంధీలో నిరసనకు దిగిన జూడాలకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా సంఘీభావం ప్రకటించింది. దాడికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Recommended Video

Telangana People Angry On Electricity Bill Charges
పీజీ వైద్యులపై దాడి..

పీజీ వైద్యులపై దాడి..


హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి (55) కరోనా సోకి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ విషయాన్ని అతనికి సహాయకుడికి చేరవేయగా.. అక్కడే ఉన్న పీజీ వైద్యులపై అతను కుర్చీ విసిరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడి సామాగ్రినంతా చిందరవందరగా పడేశాడు. అతని దాడిలో కొందరు పీజీ వైద్యులు స్వల్పంగా గాయపడ్డారు. అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటినుంచి జూడాలు విధులు బహిష్కరించి నిరసనకు దిగుతున్నారు. గతంలోనూ ఇదే గాంధీ ఆస్పత్రిలో ఓ కరోనా పేషెంట్ బంధువులు వైద్యులపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం వైపు నుంచి కఠిన చర్యలు అమలుకావాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Junior doctors who staged protest in Gandhi hospital are given a list five demands to Health minister Etela Rajender.Protests started after a coronavirus patient relatives attacked Gandhi doctors on Wednesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X