హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ ... హిజ్రాపై పెట్రోల్ పోసి సజీవదహనం .. హంస మృతి
హైదరాబాద్ లో దారుణం జరిగింది. రెండు హిజ్రా గ్రూపుల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివాన అయ్యింది. హిజ్రాల మధ్య మొదలైన గ్యాంగ్ వార్ ఉద్రిక్తతలకు కారణమైంది . హంస అనే హిజ్రాపై మరొక హిజ్రా గ్రూపు పెట్రోల్ పోసి సజీవ దహనానికి ప్రయత్నించడంతో తీవ్రంగా గాయపడిన హంస ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడి ప్రాణాలు వదిలింది . ఈ ఘటనతో హిజ్రా గ్రూప్ ల మధ్య ఉన్న గ్యాంగ్ వార్ వెలుగులోకి వచ్చింది.
ప్రేమించలేదని పెట్రోల్ పోసి యువతిని సజీవదహనం చేసిన యువకుడు ..విజయవాడలో దారుణ ఘటన

గతంలో రెండు హిజ్రా గ్రూపుల మధ్య ఘర్షణ .. కత్తులతో దాడి
హంస అనే హిజ్రా గతంలో ఎర్రగడ్డ లో ఉండేది. ఆ తర్వాత హంస చందానగర్ కు మకాం మార్చింది. దీంతో ఎర్రగడ్డలోని హిజ్రాలు హంసను చందానగర్ నుండి వెళ్లిపోవాల్సిందిగా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు హంసకు ఆశ్రయం ఇచ్చిన హిజ్రాలపై కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో గతంలో ఎర్రగడ్డ, చందనగర్ హిజ్రా గ్రూపుల మధ్య ఘర్షణలు జరిగాయి. రెండు వర్గాలు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. అప్పటికి ఆ ఘర్షణ సద్దు మణిగినా మళ్ళీ హిజ్రా గ్రూపుల మధ్య విబేధాలు మరోమారు భగ్గుమన్నాయి .

హంస హిజ్రాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చందానగర్ హిజ్రా గ్రూపు .. హంస మృతి
ఈ సారి ఏకంగా హంస పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారు చందానగర్ హిజ్రా గ్రూపు. తీవ్రంగా గాయపడిన హంస ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. హంస పై దాడి చేసింది చందానగర్ హిజ్రా గ్రూప్ కు చెందిన సదా ఆమె భర్త శంకర్ అని తెలంగాణ ట్రాన్స్ జెండర్ సంఘ ఆరోపిస్తోంది.
గత కొద్ది రోజులుగా హంసపై బెదిరింపులకు దిగుతున్నారని, దాడులకు పాల్పడుతున్నారని ట్రాన్స్జెండర్ సంఘ నేతలు లైలా, చంద్రముఖి ఆరోపిస్తున్నారు.

హంసపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిజ్రాల డిమాండ్
30 నుండి 40 మంది హంస పై దాడికి పాల్పడ్డారని, ఇంత ఘాతుకానికి ఒడిగట్టినా పోలీసులు కేసు నమోదు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. హంస ఆత్మహత్యాయత్నం చేసింది అన్నది అబద్ధమని వారంటున్నారు. హంసపై దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు తక్షణం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హిజ్రాల పేరుతో కొందరు మగవాళ్ళు కూడా చెలామణీ అవుతున్నారని , అలాంటి వారే తమపై దాడులకు దిగుతున్నారని , హైదరాబాద్ కి వచ్చిన వారిని హిజ్రా వేషం వేయించి సెక్స్
రొంపిలోకి దింపుతున్నారని ఆరోపిస్తున్నారు .