హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో గ్యాంగ్ వార్ .. 10 మంది కలిసి సినీ ఫక్కీలో వెంటాడి మరీ మర్డర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ లో గ్యాంగ్ వార్ స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది . లాక్‌డౌన్‌తో ఇప్పటికే ఉపాధి లేక ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తుంటే కాలనీలో పట్టపగలే జరిగిన మర్డర్‌ ప్రజలను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది . జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రిక్షాపుల్లర్ కాలనీలో జరిగిన ఘర్షణలో 10 మంది ఒక యువకుడిని వెంటాడి వేటాడి చంపారు.

బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టేనా ? ఆయన వ్యాఖ్యల ఆంతర్యం అదేనా !! బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టేనా ? ఆయన వ్యాఖ్యల ఆంతర్యం అదేనా !!

జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రిక్షా పుల్లర్ కాలనీలో జనాలు లాక్ డౌన్ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సమయంలో ఫయాజ్ యువకుడు అరుపులు, కేకలతో కాలనీలోకి వచ్చి తనను కాపాడుకునేందుకు పరుగులు తీశాడు.ఇక అతడ్ని వెంటాడుతూ పది మంది వచ్చారు . భయపడిన వారంతా పరుగున ఇళ్ళలోకి వెళ్ళిపోయారు. ఇక ఆ యువకుడిని వెంటాడుతూ 10 మంది గ్యాంగ్ కాలనీలో హల్చల్ చేశారు . ఒక్కసారిగా కాలనీలో టెన్షన్ నెలకొంది. సీనీ ఫక్కీలో యువకుడిని వెంటాడుతుంటే స్థానికులంతా భయంతో వణికిపోయారు. . చివరకు ఓ ఇంటి లోపలికి వెళ్లేందుకు యత్నించిన ఆ యువకుడిని పట్టుకుని రాళ్లతో మోది దారుణంగా చంపారు.

 Gang war in Hyderabad.. 10 members murdered a young man

సుమారు పది మంది వరకు అతన్ని వెంటపడి మరీ రాళ్ళతో మోది, నరికి చంపటంతో కాలనీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న కొత్త భయం పట్టుకుంది. సమచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. దారుణ హత్యకు గురైంది ఫయాజ్‌ అని గాంధీనగర్లో ఫయాజ్‌తో పాటు మరో కొంత మంది యువకులకు మధ్య ఆదివారం చిన్న గొడవ జరిగినట్లుగా స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గొడవలే హత్యకు కారణం అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పాతకక్ష్యలే ఫయాజ్‌ హత్యకు కారణంగా గుర్తించిన పోలీసులు నిందితులు గా శ్రీకాంత్‌, టిల్లు, నరేశ్‌లు ఉన్నారని అనుమానిస్తున్నారు. ఆదివారం వీరితో ఫయాజ్‌కు గొడవ జరడగంతో వీరి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.దీంతో ఆనుమానితుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారు. అనుమానితుల కోసం ఐదు టీమ్‌ లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.లాక్‌డౌన్‌తో ప్రశాంతంగా ఉన్న నగరంలో గ్యాంగ్‌ వార్‌ నెలకొనటం సంచలనంగా మారింది .

English summary
The gang war in Hyderabad caused the locals shock. people who have been living in the colony have been shocked by the murder of the young man by a gang . people who are already unemployed and wondering how to live in financial difficulties with the lockdown. A youth was killed by 10 persons in a clash in the Rickshaw puller colony under Jagadgirigutta police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X