హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ షర్మిల కొత్త పార్టీ: అభిమానులతో భేటీతో ప్రాధాన్యం, గోనె ప్రకాశ్ హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలకు మరింత హైప్ వచ్చింది. రేపు (మంగళవారం) ఆమె లోటస్ పాండ్‌లో గల అభిమానులతో సమావేశం కావడం. కొత్త పార్టీ పెడతారనే రూమర్లకు మరింత బలం చేకూరుస్తోంది. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పరోక్షంగా కామెంట్ చేశారు. పార్టీ పెట్టడం ఓకే కానీ.. నడపడం కష్టమని చెప్పారు. ఈ క్రమంలో షర్మిల ఏం చెబుతారన అంశం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

Recommended Video

9న వైఎస్ షర్మిలతో ఆత్మీయ సమ్మేళనం - తెలంగాణలో పార్టీ అంటూ జోరుగా ప్రచారం..!
భర్తతో కలిసి మీడియా సమావేశం..

భర్తతో కలిసి మీడియా సమావేశం..

హైదరాబాద్ లోటస్ పాండ్‌లో భర్త బ్రదర్ అనిల్ కార్యాలయంలో షర్మిల వైఎస్ఆర్ అభిమానులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీపై ప్రకటన చేస్తారనే అంశం చర్చకు వస్తోంది. అయితే వైఎస్ సన్నిహితుడు అయిన గోనె ప్రకాశ్ స్పందించారు. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జగన్, షర్మిల మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. 2018 క్రిస్మస్ వరకే షర్మిల పులివెందుల వెళ్లారని, జగన్ సీఎం అయ్యాక వెళ్లలేదని చెప్పారు. 2019లో జగన్ కుటుంబం మొత్తం పులివెందులకు వెళ్లినా, షర్మిల మాత్రం వెళ్లలేదని గుర్తు చేశారు. షర్మిల మాత్రం బెంగళూరులోనే ఉన్నారని తెలిపారు.

5 నెలల క్రితం చెప్పా: గోనె ప్రకాశ్

5 నెలల క్రితం చెప్పా: గోనె ప్రకాశ్

షర్మిల కొత్త పార్టీ పెడతారని నాలుగు, ఐదు నెలల క్రితమే చెప్పానని గోనె ప్రకాశ్ చెప్పారు. షర్మిల, బ్రదర్ అనిల్ ఇద్దరూ కొత్త పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేశారని తెలిపారు. 'గూడు కదులుతోంది' అంటూ షర్మిల భర్త సోషల్ మీడియాలో ఇటీవల చేసిన పోస్టు కొత్త పార్టీ గురించేనని అన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో ఉప ఎన్నికల కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారని చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేయాలని అడిగిన వెంటనే షర్మిల అంగీకరించారని చెప్పారు. 3 వేల కిలోమీరట్లకు పైగా పాదయాత్ర చేశారని తెలిపారు. ఉపఎన్నికల్లో విజయాలకు 99 శాతం షర్మిలే కారణమని వివరించారు. 2019 ఎన్నికల్లో లోక్ సభ సీటు ఇస్తానని షర్మిలకు జగన్ హామీ ఇచ్చారని, తర్వాత రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పారని... చివరకు ఏదీ ఇవ్వలేదని చెప్పారు. ఇదీ వారిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందని తెలిపారు.

అడ్వకేట్ వద్దకు పీఏ

అడ్వకేట్ వద్దకు పీఏ


జగన్ సీఎం అయిన తర్వాత షర్మిల ఒక్కసారి కూడా గుంటూరుకు వెళ్లలేదని చెప్పారు. ఆమె భర్త అనిల్ మూడు రోజులు అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందనేది కూడా తమకు తెలుసని తెలిపారు. జగన్ జైలులో ఉన్నప్పుడు రోడ్లపై పడి తిరిగితే, చివరకు తమను బాధలకు గురిచేశారని వైఎస్ కుటుంబ సభ్యులు అనుకుంటున్నారని కడపకు చెందిన వీఐపీలు మాట్లాడుకుంటున్నారని తెలిపారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం అడ్వొకేట్ దగ్గరకు పీఏను షర్మిల పంపారని.. ఇది ఎన్నికల సంఘానికి కూడా చేరిందని గోనె ప్రకాశ్ తెలిపారు. అడ్వొకేట్ ఫ్యామిలీ వైఎస్ కుటుంబానికి ఎంతో దగ్గరని గోనె ప్రకాశ్ వివరించారు.

English summary
gap between ys jagan mohan reddy and ys sharmila senior leader gone prakash said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X