• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వేషం మారింది..! దేశం మారేలోపు పట్టేసుకున్నారు..! ఎంత పనయ్యింది శివాజీ..!!

|

హైదరాబాద్ : హీరో శివాజీ గరుడ శివాజీ గా రూపాంతరం చెందిన దగ్గరనుండి వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా చెలరేగిన వివాదం మాత్రం రోజురోజుకు ముదురుతోంది. రాజకీయ అష్టదిగ్బంధనంలో ఇరుక్కున్న నటుడు, ప్రత్యేక హోదా ఉద్యమకారుడు గరుడ శివాజీని పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అలంద మీడియా కేసులో రవి ప్రకాష్ తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న పోలీసులు అక్కడి నుంచి సైబర్ క్రైం స్టేషనుకు తరలించారు. అలంద మీడియా టీవీ9 వ్యహారంలో పోలీసులు శివాజీకి నోటీసులు జారీ చేశారు. విచారణకు రమ్మని పిలిచారు. కానీ శివాజీ హాజరు కాలేదు. అది పెద్ద కేసు కాదని కొట్టిపారేస్తూ, తాను ఎక్కడికీ వెళ్ల లేదని శివాజీ కొంతకాలం క్రితం ఓ వీడియో విడుదల చేశారు. తాజాగా ఆయన ఎయిర్ పోర్టులో దొరికారు. విదేశాలకు పారిపోతుంటే పట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ పోలీసులు దీనిని అధికారికంగా ప్రకటించలేదు.

శివాజీకి పోలీసుల షాక్..! శంషాబాద్ లో పోలీసులకు చిక్కిన గరుడా గయ్..!!

శివాజీకి పోలీసుల షాక్..! శంషాబాద్ లో పోలీసులకు చిక్కిన గరుడా గయ్..!!

అయితే, పోలీసులు శివాజీకీ తాజాగా ఓ షాక్ ఇచ్చారు. అరెస్టు చేయడం లేదు గానీ ఆయన పాస్ పోర్టును సీజ్ చేశారు. ప్రస్తుతం 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 11న పూర్తి వివరాలతో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించి పంపించారు. ఈయనతో పాటు కేసు నమోదైన రవి ప్రకాష్ తొలుత అజ్జాత వాసంలో ఉండి ఆ తర్వాత పోలీసుల విచారణకు హాజరయ్యారు. రవిప్రకాష్ మీదున్న కేసులతో పోలిస్తే శివాజీది చిన్నకేసే. ఐతే అత్యంత నాటకీయ పరిణామాల మద్య హీరో శివాజీని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ నుంచి సైబరాబాద్ క్రైమ్ పీఎస్‌కు తరలించారు. అలందా మీడియా పెట్టిన కేసులో శివాజీని కస్టడీలోకి తీసుకున్నారు.

ఉప్పందించిన ఇమ్మిగ్రేషన్ అదికారులు..! రంగంలోకి దిగిన పోలీసులు..!!

ఉప్పందించిన ఇమ్మిగ్రేషన్ అదికారులు..! రంగంలోకి దిగిన పోలీసులు..!!

శివాజీ దేశం దాటి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. శివాజీని అరెస్ట్ చేయబోమన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీసీ నోటీసులు జారీ చేస్తామన్నారు. అలాగే విచారణకు సహకరించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. నోటీసులు ఆధారంగా శివాజీని విచారిస్తామని సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న తర్వాత ఆయన ఇంటికెళ్లిపోయారు.ఐతే ఎప్పుడూ పొడవైన జుట్టుతో, మీసకట్టుతో కట్టుతో ఉండే శివాజీ ఒక్కసారిగా వేషం మార్చి కనిపించారు. దీంతో పోలీసులు శివాజీని నిర్థారించుకోవడానికి కాస్త సమయం పట్టినట్టు చెప్పుకొస్తున్నారు.

చట్ట పరంగానే వ్యవహరిస్తాం..! నిర్బంద అరెస్టులు ఉండవన్న పోలీసులు..!!

చట్ట పరంగానే వ్యవహరిస్తాం..! నిర్బంద అరెస్టులు ఉండవన్న పోలీసులు..!!

టీవీ9 వాటాల విషయంలో మాజీ సీఈవో రవిప్రకాశ్, హీరో శివాజీ ఫోర్జరీకి పాల్పడినట్లు అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో రవిప్రకాశ్‌ను విచారించారు. శివాజీకి కూడా పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఆయన విచారణకు హాజరుకాలేదు. తనపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ శివాజీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా ఈ రోజు పోలీసులకు చిక్కిన శివాజి యంగ్ హీరోలను తలదన్నే రీతిలో ఉన్నట్టు తెలుస్తోంది. జీన్స్, నెక్ లెస్ టీ షర్ట్ తో దర్శనమిచ్చారు. అకస్మాత్రుగా చూసిన ఎవరికైనా అతనే శివాజీ అని పోల్చుకోవడానికి కొంత సమయం పట్టే రీతిలో శివాజీ గెటప్ మార్చుకోవడం విశేషం.

ఎట్టకేలకు చిక్కిన శివాజీ..! నోటీసుల ఆధారంగా విచారణ అంటున్న కాప్స్..!!

ఎట్టకేలకు చిక్కిన శివాజీ..! నోటీసుల ఆధారంగా విచారణ అంటున్న కాప్స్..!!

హీరో శివాజీని సైబరాబాద్ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అమెరికా వెళ్లేందుకు ఆయన నేటి తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శివాజీకి సంబంధించిన సమాచారాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు శివాజీని అదుపులోకి తీసుకున్నారు. దేశం దాటి వెళ్లాలని శివాజీ యత్నిస్తుంటే అడ్డుకున్నామని.. కానీ ఆయనను అరెస్ట్ చేసేది లేదని పోలీసులు తెలిపారు. శివాజీని విచారణకు సహకరించాల్సిందిగా కోరామని.. నోటీసుల ఆధారంగా ఆయనను విచారిస్తామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

English summary
Police have issued notices to Shivaji at the Alanda Media TV9 issue. Summoned to trial. But Shivaji did not attend. Shivaji released a video some time ago saying he was not going anywhere, dismissing it as not a big case.He was recently found at the airport. There are reports of being caught fleeing abroad.But police have not officially announced it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X