హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణకైన సిద్దం : ప్రభాకర్ రావు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన ఆరోపణలను జెన్‌కో మరియు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తీవ్రంగా ఖండించారు. ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆయన అన్నారు. ఒప్పందాలపై సిట్టింగ్ జడ్జికాడు సీబీఐ విచారణకైనా తాము సిద్దమే అని సవాల్ విసిరారు..తమపై ఎవరి ఒత్తిళ్లు పనిచేయలేదని, విద్యుత్ ఒప్పందాల విషయంలో స్వచ్ఛంధంగానే వ్యవహరిస్తున్నామని ఆయన తెలిపారు. లక్ష్మన్ తప్పుడు సమాచారంతో ఆరోపణలు చేశారని అన్నారు. విద్యుత్ ఒప్పందాలపై ఎవ్వరికి అపోహలు ఉన్నా తీర్చేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఈనేపథ్యంలోనే పలు విద్యుత్ ఒప్పందాలపై ఆయన వివరించారు. రాత్రీకి రాత్రే పీపీఏలు చేసుకున్నామని చెప్పడం అవాస్తమని అన్నారు. ఎక్కడా ఇలాంటీ పీపీఏ ఒప్పందాలు జరగవని అన్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతోనే తాము విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామని , ఈ మేరకు రూ 3.90 పైసలకు ఒప్పందం కుదుర్చున్నామని అన్నారు. ఇక 4.30 పైసలకు ఎన్టీపీసీ విద్యుత్ సరఫరా చేస్తామని ఎప్పుడు చెప్పలేదని అన్నారు.

Genco CMD Prabhakar Rao have denied the allegations made by laxman

మరోవైపు రాష్ట్రంలో జరిగిన అన్ని విద్యుత్ ఒప్పందాలు పారదర్శకంగా జరిగాయని అన్నారు.సోలార్ పవర్‌ పస్తుతానికి 8000 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని అన్నారు. సోలార్ పవర్‌కు సంబంధించి సెకండ్ ర్యాంక్ వచ్చిందని, మరోవైపు తెలంగాణ విద్యుత్ సంస్థకు ఏప్లస్ రేటింగ్ ఇచ్చారని తెలిపారు.

English summary
Genco CMD Prabhakar Rao have denied the allegations made by BJP state president Laxman that the Telangana government's power purchase deals were a major scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X