హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ కు రాబోయో నీటి సమస్యపై అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ.. ఇక భారీగా జరిమానాలు

|
Google Oneindia TeluguNews

దేశంలోని పలు రాష్ట్రాల్లోని మహానగరాలు ఎదుర్కోవడంతో హైదరాబాద్ నగరపాలక సంస్థ అలర్ట్ అయింది. ఇప్పటికే వర్షాలు అంతంతమాత్రన కురుస్తుండడంతో నగరం చుట్టు ఉన్న జలశాయాలు ఎండిపోయిన పరిస్థితి ఉంది. దీంతో గోదావరి జలాలపై నగరం ఆధారపడుతోంది. అయితే హైదరాబాద్ నగరానికి ఇప్పటికిప్పుడు ఎలాంటీ నీటి ఎద్దడి ప్రమాదం లేనప్పటికి భవిష్యత్‌లో నీటీ వనరులను వృధాగా పోకుండా కాపాడేందుకు నడుం బిగించారు. ఈనేపథ్యంలోనే నీటీ వృధాను అరికట్టేందుకు పలు కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు.

వాహానాలు కడిగినా జరిమానాలు

వాహానాలు కడిగినా జరిమానాలు

నగరంలో పలు చోట్ల నీటీ ఎద్దడి ఉన్నా నగర ప్రజలు పట్టించుకోని పరిస్థితి.. నగరంలోని నల్లా నీరు అన్ని ప్రాంతాలకు సరిపోనంతగా రాని పరిస్థితి ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం రోడ్లమీద పోంగిపోర్లే విధంగా నీళ్లు ఏరులై పారతాయి దీంతో ప్రజలు, నీటీని తమ వాహానాలను కడడంతో పాటు అవసరం లేకుండా ఇళ్లను, దుకాణాలను కడగడంతో నీటీని వృధాగా రోడ్డుమీదకు వదిలేస్తారు. ఇక ఇప్పటి నుండి వారిని గుర్తించి జరిమానాలు విధించేందుకు జలమండలి అధికారులు సన్నద్దమవుతున్నారు.

నీటీ వృధా చేయకుండా చర్యలు

నీటీ వృధా చేయకుండా చర్యలు

ఈ నేపథ్యంలోనే న‌గ‌రంలో ఇళ్లు, వాహ‌నాలను క‌డ‌గ‌డం ద్వారా నీటిని భారీ ప‌రిమాణంలో వృథా చేసేవారిని గుర్తించి వారిపై భారీ జ‌రిమానాలు విధించాల‌ని జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లిల సంయుక్త సమావేశంలో నిర్ణ‌యించాయి. ఈ సంద‌ర్భంగా జీహెఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మంచినీటిని అందించేందుకు జ‌ల‌మండ‌లి ద్వారా విద్యుత్ చార్జీల నిమిత్తం రూ. 700 కోట్లు చెల్లిస్తున్నామ‌ని, వీటిలో దాదాపు రూ. 200 కోట్ల విలువైన విద్యుత్ బిల్లుల‌కు స‌రిప‌డా మొత్తం నీరు వృథాగా పోతున్నాయ‌ని వివ‌రించారు.

ప్రతి రోజు పర్యవేక్షణలు...

ప్రతి రోజు పర్యవేక్షణలు...

ప్ర‌తిరోజు వృథాగా పోతున్న 50 మిలియ‌న్ గ్యాల‌న్ల నీరు వృథా అడ్డుకునేందుకు ఇప్ప‌టికే జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి ఆధ్వ‌ర్యంలో అనేక చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని, అయిన‌ప్ప‌టికీ ప‌లువురు త‌మ ఇళ్ల‌ను, దుకాణాల‌ను, వాహ‌నాల‌ను క‌డ‌గ‌డానికి భారీ ప‌రిమాణంలో నీటిని వృథా చేస్తున్నార‌ని వివరించారు. ఇక నుండి ఈ వృథాను స‌హించేదిలేద‌ని హెచ్చరించారు. నీటి వ‌ృధాను అరికట్టడడం కోసం ప్ర‌తిరోజు ఉద‌యం జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి అధికారులు క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌నలు చేస్తారని తెలిపారు. ఈ సంద‌ర్భంగా నీటిని వృథా చేసేవారిని గుర్తించి భారీ ఎత్తున జ‌రిమానాలు విధించాల‌ని ఆదేశించారు.

English summary
At a joint meeting of the GHMC and the Water Board, they have decided to huge fine who recognize the huge wastage of water by washing houses and vehicles in the city.Officers will do the inspection in the morning to identyfy the consumers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X