హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

GHMC Election Results 2020: అమిత్ షాకు షాక్ -ఆ 2టీఆర్ఎస్ ఖాతాలోకి -కవితకు ఎదురుదెబ్బ

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అద్భుతమైన రీతిలో బలం పుంజుకుని, దాదాపు ఐదు పదుల స్థానాలను కైవసం చేసుకుంది. పేరుకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ కేవలం 56 సీట్లకే పరిమితమైపోయింది. ఎంఎం తన పాత స్థానాలు (44 సీట్లు) కాపాడుకోగా, కాంగ్రెస్ 2 సీట్లను గెలుచుకుంది. ఏరకంగా చూసినా బీజేపీ దుమ్మురేపిన ఈ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలెన్నో చోటుచేసుకున్నాయి..

గ్రేటర్ దెబ్బ: బీజేపీ పేరెత్తని కేటీఆర్ -ఫలితాలపై అనూహ్య వ్యాఖ్యలు -అందుకే ఓడిపోయాంగ్రేటర్ దెబ్బ: బీజేపీ పేరెత్తని కేటీఆర్ -ఫలితాలపై అనూహ్య వ్యాఖ్యలు -అందుకే ఓడిపోయాం

అమిత్ ‘రోడ్ షో’ ప్లాప్..

అమిత్ ‘రోడ్ షో’ ప్లాప్..

గల్లీ స్థాయి ఎన్నికలను కూడా ఢిల్లీతో సమానంగానే చూస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా గ్రేటర్ ప్రచారబరిలోకి దిగడం తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం చివరిరోజైన నవంబర్ 29న నగరానికి విచ్చేసిన అమిత్ షా.. చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేసి నేరుగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. ఇదే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి.. అమిత్ షాకు డిప్యూటీ మంత్రి కూడా కావడం ఈ సెగ్మెంట్ లో కలిసొస్తుందని కాషాయ నేతలు భావించారు. కానీ శుక్రవారం నాటి ఫలితాల్లో అమిత్ రోడ్డు షో ప్లాప్ గా తేలిపోయింది. ఎలాగంటే..

ఆ రెండు చోట్లా బీజేపీ ఓటమి

ఆ రెండు చోట్లా బీజేపీ ఓటమి

కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ చీఫ్ అమిత్ షా.. జీహెచ్ఎంసీలోని వారాసీగూడ చౌరస్తా నుంచి నామాలగుండు వరకు రోడ్ షో నిర్వహించారు. షా రోడ్డుషో చేపట్టిన ప్రాంతాలు బౌద్ధనగర్, సీతాఫల్ మండి డివిజన్ల కిందికి వస్తాయి. ఈ రెండు సీట్లలో బీజేపీ ఓడిపోవడం గమనార్హం. సీతాఫల్ మండిలో టీఆర్ఎస్ అభ్యర్థి సామాల హేమకు 14,035ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థి దీప్తికి 12,834 ఓట్లు పడ్డాయి. ఈ డివిజన్ లో నోటాకు ఏకంగా 628 ఓట్లు పడటం, 443 ఓట్లు చెల్లకుండా పోవడం గమనార్హం. ఇక బౌద్ధనగర్ లో బీజేపీ స్వల్ప తేడాతో ఓడింది. టీఆర్ఎస్ అభ్యర్థి కంది శైలజకు 9997 ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థి మేకల కీర్తికి 9185ఓట్లు దక్కాయి. ఈ డివిజన్ లోనూ నోటాకు 373 ఓట్లు పడగా, 581ఓట్లు చెల్లకుండా పోయాయి. మరోవైపు..

Recommended Video

GHMC Results : Uttam Kumar Reddy Resigns As chief Of Telangana Congress
కవితకు ఊహించని షాక్..

కవితకు ఊహించని షాక్..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గ్రేటర్ ఎన్నికల్లో ఊహించని షాక్‌ తగిలింది. కవిత ఇన్‌చార్జ్‌గా ఉన్న గాంధీనగర్‌లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇక్కడ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ముఠా పద్మా నరేష్.. బీజేపీ అభ్యర్థి పావని చేతిలో ఓటమి పాలు కావడం టీఆర్‌ఎస్‌కు షాకిచ్చింది. ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత త్వరలో మంత్రి పదవి చేపట్టనున్నట్లు తీవ్రంగా చర్చ జరుగుతున్న ఈ తరుణంలో ఆమె ఇంచార్జ్‌గా ఉన్న స్థానం నుంచి కార్పొరేటర్ అభ్యర్థి ఓడిపోవడం అధికార పార్టీకి మింగుడు పడని విషయంగా మారింది. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో టీఆర్‌ఎస్ మంత్రులు, ముఖ్య నేతలు ఇంచార్జ్‌లుగా ఉన్న చోట గులాబీ పార్టీకి ఓటమి తప్పలేదు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న అడిక్‌మెట్‌లో, మంత్రి సబిత ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆర్కే పురంలో టీఆర్‌ఎస్‌ ఓటమి పాలైంది.

English summary
Hyderabad GHMC Election Results 2020 Updates in Telugu, bjp lost in both divisions, seethaphalmandi and boudha nagar, where union minister amit shah conducts road show in hyderabad. both divisions won by trs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X