హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

GHMC Election Results 2020: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం..సెకండ్ ప్లేస్‌లో టీఆర్ఎస్..

|
Google Oneindia TeluguNews

గ్రేటర్‌లో ఎన్నికల అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్ ఓట్లను కౌంట్ చేస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. ఆ తర్వాత టీఆర్ఎస్ కనిపిస్తోంది. డివిజన్ల వారీగా చూస్తే.. గాజులరామారంలో బీజేపీకి 3, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్‌కు 1 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి.

GHMC Exit polls : ఎగ్జిట్ పోల్స్ తలకిందులవుతాయా.. కారుకు రివర్స్ గేర్ తప్పదంటున్న బీజేపీ.. GHMC Exit polls : ఎగ్జిట్ పోల్స్ తలకిందులవుతాయా.. కారుకు రివర్స్ గేర్ తప్పదంటున్న బీజేపీ..

ఇక సూరారం డివిజన్ సంగతికి వెళితే టీఆర్ఎస్ 1, బీజేపీ 1, చెల్లనివి అత్యధికంగా 2 ఓట్లు ఉన్నాయి. పటాన్ చెరులో టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, భారతీనగర్ టీఆర్ఎస్ 3, బీజేపీ 4 వచ్చాయి. ఇక చింతల్ బీజేపీ 2, చెల్లనివి 2 ఓట్లు పోలయ్యాయి. జీడిమెట్ల టీఆర్ఎస్ 4, బీజేపీ 6, చెల్లనివి 1 ఓటు ఉంది. సుభాష్ నగర్ టీఆర్ఎస్ 9, బీజేపీ 3, చెల్లనివి 2 ఓట్లు వచ్చాయి. చంపాపేట బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1 ఓటు ఉంది. లింగోజిగూడ బీజేపీ 5, టీఆర్ఎస్ 2, టీజేఎస్ 1 ఓటు ఉంది. వనస్థలిపురం బీజేపీ 5, టీఆర్ఎస్ 2, నోటా 1 వచ్చింది. హస్తినాపురం బీజేపీ 2 ఓట్లు ఉన్నాయి.

GHMC Election Results 2020: bjp lead in postal ballot votes

ప్రస్తుత ట్రెండ్ ప్రకారం బీజేపీ 20 చోట్ల లీడ్‌లో ఉండగా.. టీఆర్ఎస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే కొన్నిచోట్ల ఇప్పటివరకు కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఓల్డ్ మలక్ పేట, గోషామహల్‌, రాంనగర్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కాలేదు. కౌంటింగ్ కేంద్రానికి ఏజెంట్లు రాలేదని.. ఇతరత్రా కారణాలను అధికారులు చెబుతున్నారు.

English summary
Hyderabad GHMC Election Results 2020: bjp lead in postal ballot votes, trs is second place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X