హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొంపముంచిన కొడుకు: తల్లిని ఓడించిన పుత్రరత్నం.. 32 ఓట్లతో బీజేపీ అభ్యర్థి విజయం..

|
Google Oneindia TeluguNews

ఎన్నికల్లో అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. గ్రేటర్ ఎన్నికల్లో కూడా అలాంటి ఘటనలు జరిగాయి. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బీఎన్ రెడ్డి నగర్‌లో జరిగిన ఘటన చర్చకు దారితీసింది. ఇక్కడ ఓకే కుటుంబం నుంచి ఇద్దరూ పోటీ చేశారు. అయితే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన కుమారుడికి కూడా డబుల్ డిజిట్ ఓట్లు వచ్చాయి. అవే టీఆర్ఎస్ అభ్యర్థి, అతని తల్లి కొంపముంచాయి.

32 ఓట్లతో పరాజయం..

32 ఓట్లతో పరాజయం..

గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ ఓట్లతో టీఆర్ఎస్ ఓటమి పాలయ్యింది బీఎన్ రెడ్డి నగర్.. మిగతా 12 చోట్ల కూడా 200 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఈ విషయాన్ని నిన్న మీడియా సమావేశంలో కేటీఆర్ వెల్లడించారు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గౌడ్ భార్య ముద్దగొని లక్ష్మీప్రసన్న గౌడ్ బరిలోకి దిగారు. బీజేపీ నుంచి ఎం లచ్చిరెడ్డి పోటీ చేశారు. అయితే రామ్మోహన్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి తన కుమారుడు రంజిత్ గౌడ్‌ను కూడా బరిలోకి దింపారు. ఆయన ఇండిపెండెంట్‌గా పోటీకి దిగారు.

 ఎన్ని ఓట్లు వస్తాయో చుద్దాం అని..

ఎన్ని ఓట్లు వస్తాయో చుద్దాం అని..

రంజిత్‌కు ఎన్ని ఓట్లు వస్తాయని ఎక్స్ పెక్ట్ చేశారో.. లేక ఓట్లను చీల్చుతామని అనుకున్నారో తెలియదు.. కానీ వారు మరోసారి ఇలాంటి ప్రయత్నం చేయకుండా షాక్ తగిలింది. రంజిత్‌కు 39 ఓట్లు వచ్చాయి. కానీ ఆ ఓట్లు లక్ష్మీప్రసన్న ఓటమిని నిర్ణయించారు. బీజేపీ అభ్యర్థి లచ్చిరెడ్డి 32 ఓట్లతో విజయం సాధించారు. దీంతో లక్ష్మీప్రసన్న అండ్ కో నోరెళ్లబెట్టాల్సి వచ్చింది.

ఫలించని ప్రయోగం..

ఫలించని ప్రయోగం..

లచ్చిరెడ్డికి 11 వేల 438 ఓట్లు రాగా.. లక్ష్మీప్రసన్నకు 11 వేల 406 ఓట్లు వచ్చాయి. దీంతో లక్ష్మీప్రసన్న దంపతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాము చేసిన ప్రయోగం ఘోరంగా విఫలమయ్యిందని బాధపడ్డారు. అయితే రంజిత్ రెడ్డి ట్రాక్ రికార్డ్ కూడా సరిగా లేదు. ఆయన ఇదివరకు ఔటర్ రింగ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతోపాటు పలు వివాదాలు ఉన్నాయి. అందుకోసమే కేవలం 39 ఓట్లు వచ్చాయి. అయినా అతని తల్లి మాత్రం గెలవలేదు. ఒకవేళ ఆ 39 ఓట్లు లక్ష్మీప్రసన్నకు వస్తే.. ఆమెనే విజయం సాధించేవారు. కానీ అలాంటి సువర్ణ అవకాశం వారు కోల్పోయారు. ఇందుకు కారణం ఆ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప మరొకరు కాదు.

English summary
Hyderabad GHMC Election Results 2020: BN Reddy Nagar division where the victory margin was just 32 votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X