హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

GHMC Election Results 2020 Live: షాకింగ్ ఫలితాలు -వేర్వేరు లెక్కలు -ఎస్ఈసీ మరోలా -రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

తమ వంతు కర్తవ్యంగా ప్రజాస్వామిక పండుగలో పాల్గొని ఫలితాల కోసం ఎదురుచూసే ప్రజలకు ప్రతిసారి ప్రతిఘాతాలు తప్పడంలేదు. ఎన్నికలు ఏవైనా.. వాటి ఫలితాల విషయంలో ప్రతిసారి షాకులే. అప్ డేట్స్ చూద్దామని టీవీ పెడితే.. వేర్వేరు న్యూస్ ఛానెళ్లలో వేర్వేరు ఫలితాలు కనిపిస్తాయి. ఇక డిజిటల్ మీడియా జోరు తెలిసిందే. అదే ఎన్నికల సంఘం అధికారిక వెబ్ చూస్తే మాత్రం 'నిదానమే ప్రధానం -కచ్చితత్వమే విధానం' అనిపించకమానదు. శుక్రవారం వెలువడిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లోనూ అదే తీరు ప్రస్ఫుటమైంది..

 కరోనా విలయం: మోదీ సంచలనం -వచ్చే వారాల్లోనే వ్యాక్సిన్‌ పంపిణీ -ఉచితం కాదు -ధర ఎంతంటే కరోనా విలయం: మోదీ సంచలనం -వచ్చే వారాల్లోనే వ్యాక్సిన్‌ పంపిణీ -ఉచితం కాదు -ధర ఎంతంటే

తుది ఫలితాలు ఆలస్యం..

తుది ఫలితాలు ఆలస్యం..

రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార ప్రకటన మేరకు శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు కేవలం 10 డివిజన్ల ఫలితాలు మాత్రమే వెలువడ్డాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించడంతో సహజంగానే కౌంటింగ్ ఆలస్యం కానుంది. దానికితోడు కౌంటింగ్ కేంద్రాల్లో కొవిడ్ ప్రోటోకాల్స్ గట్టిగా అమలవుతుండటం, గతంలో కంటే రౌండ్లు, టేబుళ్ల సంఖ్యను పెంచిన కారణంగా తుతి ఫలితాలు రావడానికి చాలా సమయం పట్టే అవకాశముంది. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్, ఒక్కో హాలులో 14 టేబుల్స్ ఏర్పాటుచేశారు. ఒక్కో రౌండులో గరిష్టంగా 14వేల ఓట్లను లెక్కిస్తున్నారు. తక్కువ ఓట్లున్న డివిజన్లలో ముందుగా ఫలితాలు వెలడగా, ఎక్కువ ఓట్లున్న డివిజన్ల ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. ఎందుకంటే..

నారా లోకేశ్ మెడకు సీఐడీ ఉచ్చు -హైకోర్టుకు ఆధారాలు - ప్రభుత్వానికి నష్టమేంటన్న జడ్జి -తీర్పు రిజర్వ్నారా లోకేశ్ మెడకు సీఐడీ ఉచ్చు -హైకోర్టుకు ఆధారాలు - ప్రభుత్వానికి నష్టమేంటన్న జడ్జి -తీర్పు రిజర్వ్

అసెంబ్లీ స్థాయిలో 19 డివిజన్లు

అసెంబ్లీ స్థాయిలో 19 డివిజన్లు

గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 150 డివిజన్లు ఉండగా, వాటిలో 40వేలలోపు ఓటర్లున్న డివిజన్లు మొత్తం 19 ఉన్నాయి. ముందుగా ఫలితాలు వెలువడిన మెహదీపట్నం, ఏఎస్ రావు నగర్, తలాబ్ చంచలం, సంతోష్ నగర్ లాంటి డివిజన్లు ఈ కోవలోనివే. అదే, దాదాపు అసెంబ్లీ సెగ్మెంట్ కు సమాన స్థాయిలో 60వేల పైచిలుకు ఓట్లున్న డివిజన్లు మరో 19 ఉన్నాయి. వీటి ఫలితాలు ఒకింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికల కమిషన్ వాస్తవ ఫలితాలను ప్రకటిస్తున్నప్పటికీ..

అసలైన ఫలితాలు ఇవే..

అసలైన ఫలితాలు ఇవే..

బల్దియా ఫలితాలపై శుక్రవారం నుంచి టీవీ ఛానెళ్లలో సందడి నెలకొంది. అమిత్ షా లాంటి బడా నేతలు కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో జాతీయ ఛానెళ్లు సైతం జీహెచ్ఎంసీ ఫలితాల కవరేజీ అందిస్తున్నాయి. అయితే, ఒక్కో ఛానెల్ తమ పొలిటికల్ పాలసీల మేరకు ఫలితాలను ఒక్కో తీరుగా ప్రొజెక్ట్ చేస్తుండటంతో అసలైన ఫలితాల కోసం ప్రజలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ అనుకూల ఛానెళ్లలో టీఆర్ఎస్ నంబర్ ను తగ్గించి చూపగా, గులాబీ మీడియాలో బీజేపీ ఆధిక్యంలో ఉన్న వార్డుల సంఖ్య తక్కువగా చూపారు. దీంతో అన్ని ఛానెళ్లు చూస్తే తప్ప ఏది నిజమో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్ సైట్ లో అసలైన ఫలితాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నప్పటికీ, దానికి రీచౌట్ తక్కువగా ఉంది.

డివిజన్ల వారీగా ఓటర్ల సంఖ్య..

డివిజన్ల వారీగా ఓటర్ల సంఖ్య..

గ్రేటర్ లో మొత్తం 73,56,382మంది ఓటర్లుండగా 46.5 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో 78 వేల ఓటర్లు, అత్యల్పంగా భారతీనగర్‌లో 21102 మంది ఓర్లున్నారు. శుక్రవారం ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆయా వార్డుల్లో కౌంటింగ్ ఎందుకు ఆలస్యమవుతున్నదో అర్థం చేసుకోవాలంటే, ముందు ఎంత మంది ఓటర్లున్నారో ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. ముందుగా 40వేలలోపు ఓటర్లున్న డివిజన్లపై ఓ లుక్కేస్తే..

40వేల లోపు ఓట్లున్న డివిజన్లు..

40వేల లోపు ఓట్లున్న డివిజన్లు..

ఏఎస్‌ రావ్‌ నగర్‌ 37560

హబ్సిగూడ 33813

అక్బర్‌బాగ్‌ 38950

లలితాబాగ్‌ 37395

బార్కాస్‌ 39399

పురానాపూల్‌ 37338

ఫలక్‌నుమా 36388

దూద్‌బౌలి 37347

రామ్‌నాస్‌పుర 36165

శాస్త్రీపురం 39447

మెహిదీపట్నం 35184

టోలీచౌకీ 39448

గోషామహల్‌ 38046

దత్తాత్రేయనగర్‌ 24161

భారతీనగర్‌ 21102

ఆర్సీపురం 26748

చింతల్‌ 30060

వెంకటాపురం 39283

రామ్‌గోపాల్‌పేట్‌ 38462

50 నుంచి 60 వేల ఓటర్లున్న స్థానాలివి..

50 నుంచి 60 వేల ఓటర్లున్న స్థానాలివి..


కాప్రా 50469

ఉప్పల్‌ 58229

నాగోల్‌ 52184

మన్సూరాబాద్‌ 52152

హయాత్‌నగర్‌ 50814

బీఎన్‌ రెడ్డినగర్‌ 51152

సరూర్‌నగర్‌ 58382

ఆర్‌కే పురం 55450

సైదాబాద్‌ 56214

ఆజంపుర 51796

డబీర్‌పుర 50856

కుర్మగూడ 54930

ఐఎస్‌ సదన్‌ 50663

పత్తర్‌గట్టి 57865

అత్తాపూర్‌ 55146

గుడిమల్కాపూర్‌ 50321

ఆసిఫ్‌నగర్‌ 50245

విజయనగర్‌ కాలనీ 52477

అహ్మద్‌నగర్‌ 56423

మల్లేపల్లి 57963

కార్వాన్‌ 54878

గోల్కొండ 53307

నానల్‌నగర్‌ 50233

భోలక్‌పూర్‌ 55819

గోల్నాక 50445

అంబర్‌పేట్‌ 55410

బాగ్‌అంబర్‌పేట్‌ 54159

ఖైరతాబాద్‌ 55582

సోమాజిగూడ 52540

బంజారాహిల్స్‌ 50088

జూబ్లీహిల్స్‌ 50480

వెంగళరావునగర్‌ 54621

గచ్చిబౌలి 50897

మాదాపూర్‌ 57337

మియాపూర్‌ 59519

చందానగర్‌ 57436

బాలాజీనగర్‌ 54024

కేపీహెచ్‌బీ కాలనీ 53534

ఓల్డ్‌ బోయిన్‌పల్లి 56534

కూకట్‌పల్లి 50988

వివేకానందనగర్‌ 52869

హైదర్‌నగర్‌ 51988

ఆల్విన్‌కాలనీ 57712

గాజుల రామారం 58294

సూరారం 50526

మచ్చబొల్లారం 51463

అల్వాల్‌ 53417

నేరేడ్‌మెట్‌ 57223

వినాయకనగర్‌ 51351

గౌతమ్‌నగర్‌ 51081

60 వేల పైచిలుకు డివిజన్లు ఇవే

60 వేల పైచిలుకు డివిజన్లు ఇవే

నాచారం 60311

రామంతాపూర్‌ 61580

మూసారంబాగ్‌ 63675

సనత్‌నగర్‌ 63502

షేక్‌పేట్‌ 60131

ఎర్రగడ్డ 67567

కొండాపూర్‌ 66587

శేరిలింగంపల్లి 77357

హఫీజ్‌పేట్‌ 70374

అల్లాపూర్‌ 60117

సుభాష్‌నగర్‌ 66325

కుత్బుల్లాపూర్‌ 62812

తార్నాక 74732

సీతాఫల్‌మండీ 61224

బన్సీలాల్‌పేట్‌ 61957

మైలార్‌దేవ్‌పల్లి 78428

English summary
Hyderabad GHMC Election Results 2020 Live Updates in Telugu, amid ghmc result public get confused when different numbers shown in various tv channels according to their political priorities. while telangana state election commission website updating accurate result
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X