హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

GHMC Election Results 2020 Live: నోటాకు భారీగా ఓట్లు -పలు వార్డుల్లో ఫలితం తారుమారు

|
Google Oneindia TeluguNews

జాతీయ నేతల రాకతో స్థానిక ఎన్నికలు కాస్తా సాధారణ అసెంబ్లీ ఎన్నికల స్థాయి ప్రచారం జరిగింది. గతేడాది 4 లోక్ సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. తాజాగా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గులాబీ దళానికి భారీ షాకిచ్చింది. అదే ఊపులో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరంగా సాగింది. అయితే, కాషాయనేతల మతవిద్వేష వ్యాఖ్యలపై.. టీఆర్ఎస్ వ్యతిరేకులు కూడా అసహనం వ్యక్తం చేయడం, వరద ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం.. తదితర కారణాలు శుక్రవారం నాటి ఫలితాల్లో ప్రస్పుటంగా కనిపించింది. అదే సమయంలో బ్యాలెట్ ను ఓటర్లు సరిగా డీల్ చేయలేకపోయారనడానికి నిదర్శనంగా చెల్లని ఓట్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

GHMC Election Results 2020 Live: షాకింగ్ ఫలితాలు -వేర్వేరు లెక్కలు -ఎస్ఈసీ మరోలా -రీజన్ ఇదేGHMC Election Results 2020 Live: షాకింగ్ ఫలితాలు -వేర్వేరు లెక్కలు -ఎస్ఈసీ మరోలా -రీజన్ ఇదే

నోటాకు భారీగా ఓట్లు..

నోటాకు భారీగా ఓట్లు..

బల్దియా ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరి ప్రచారం సాగినప్పటికీ, చాలా మంది ఓటర్లు కచ్చితంగా ఒక పార్టీని గెలిపించాలనో, ఇంకో పార్టీని ఎలాగైనా ఓడించాలనో నిర్ణయానికి రాకపోవడంతో వారంతా నోటాను ఆశ్రయించారు. బ్యాలెట్ పద్ధతిలో చేపట్టిన ఓటింగ్ లో.. తెలుపు రంగు బ్యాలెట్లను ఉపయోగించగా.. ఈ సారి ఎన్నికల బ్యాలెట్‌ పత్రాలపైనా నోటా చిహ్నాన్ని సైతం ముద్రించడం విశేషం. ఈ వెసులుబాటుతో చాలా మంది ఓటర్లు నోటాకు చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లేశారు. దీనికితోడు 20 ఏళ్లుగా ఈవీఎంలలో ఓట్లేస్తోన్న సిటీ జనం.. బ్యాలెట్ పై తమ ఓటును తప్పుగా వేయడంతో చెల్లని ఓట్ల సంఖ్య కూడా చాలా పెద్దగానే ఉంది.

కరోనా విలయం: మోదీ సంచలనం -వచ్చే వారాల్లోనే వ్యాక్సిన్‌ పంపిణీ -ఉచితం కాదు -ధర ఎంతంటేకరోనా విలయం: మోదీ సంచలనం -వచ్చే వారాల్లోనే వ్యాక్సిన్‌ పంపిణీ -ఉచితం కాదు -ధర ఎంతంటే

నోటా దెబ్బకు మారిన ఫేట్

నోటా దెబ్బకు మారిన ఫేట్

గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి రెండు దశాబ్దాల్లోనే అత్యధికంగా 46శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు వెల్లడించిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 72 స్థానాలు, బీజేపీ 37, ఎంఐఎం 39, కాంగ్రెస్ 2 స్థానాల్లో లీడింగ్ లేదా విజయం సాధించాయి. అయితే పలు డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరగడం, అలాంటి స్తానాల్లో.. నోటాకు వందల సంఖ్యలో ఓట్లు పడటం, అదే సమయంలో చెల్లని ఓట్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండటం అభ్యర్థుల తలరాతను మార్చేసింది. ఉదాహరణకు..

కొంపముంచిన చెల్లని ఓట్లు..

కొంపముంచిన చెల్లని ఓట్లు..

144వ డివిజన్ మెట్టుగూడలో మొత్తం 39,268 ఓట్లుండగా, 16,852 ఓట్లు పోలయ్యాయి. అందులో టీఆర్ఎస్ అభ్యర్థి సరితకు 7,592 ఓట్లు, బీజేపీ అభ్యర్థి శారదకు 7,008ఓట్లు వచ్చాయి. కానీ ఇక్కడ నోటాకు 230 ఓట్లురాగా, 340 ఓట్లు చెల్లలేదు. దీంతో బీజేపీ వెంట్రుకవాసిలో సీటు కోల్పోయింది. హబ్సీగూడ(8వ డివిజన్)లో బీజేపీకి 10,803, టీఆర్ఎస్ కు 9356 ఓట్లురాగా, నోటాకు 218, చెల్లని ఓట్లు 426గా ఉన్నాయి. వనస్థలిపురం (15వ డివిజన్)లో బీజేపీకి 9214 ఓట్లు, టీఆర్ఎస్ కు 8512 ఓట్లురాగా, నోటాకు 259 ఓట్లు పడ్డాయి. మరో 268 ఓట్లు చెల్లకపోవడంతో గెలుపు అటు ఇటయింది. ఈ మూడు డివిజన్లతోపాటు సుమారు 120 డివిజన్లలో ప్రతి చోటా నోటాకు 100 నుంచి 300 ఓట్లు పడటం, అవే వార్డుల్లో చెల్లని ఓట్ల సంఖ్య 200 నుంచి 400 దాకా ఉండటం గెలుపోటములను తారుమారు చేసింది. బ్యాలెట్ పై ఏ రకంగా ఓటేసినా దాన్ని చెల్లుబాటుగా పరిగణించాలని ఎస్ఈసీ భావించినా, అందుకు హైకోర్టు నో చెప్పడం, స్వస్తిక్ గుర్తు స్పష్టంగా గుర్తుపై పడిన ఓట్లను మాత్రమే లెక్కించాలని ఆదేశించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

English summary
Hyderabad GHMC Election Results 2020 Live Updates in Telugu, amid ghmc result, nota gets countable votes in several divisions. till now trs leading in majority seats in a path to win mayor seat once again. bjp gives tough fight to trs in many divisions. aimim secures 40 plus divisions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X