హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

GHMC Election Results 2020 Live:గ్రేటర్‌లో హంగ్..మేయర్ పీఠంపై కొనసాగుతోన్న ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 150 డివిజన్లకు పోలింగ్ జరుగగా 149 డివిజన్లకు పోలింగ్ డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరుగగా ఓల్డ్ మలక్‌పేట్‌కు మాత్రం డిసెంబర్ 3వ తేదీన రీపోలింగ్ జరిగింది. ఈ సారి పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. దీంతో పార్టీల్లో టెన్షన్ నెలకొంది. బీజేపీ సైలెంట్ వేవ్‌ను నమ్ముకోగా అధికారిక టీఆర్ఎస్ మాత్రం విజయం తమదే అన్న ధీమాతో ఉంది.

ఇక ఓల్డ్ మలక్‌పేట్‌లో రీపోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు హోరెత్తించాయి. అన్ని సర్వేలు గులాబీ పార్టీకే అనుకూలంగా తమ ఫలితాలను వెలువరించాయి. ఇక టీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగిందని చెప్పుకొచ్చాయి. ఇదిలా ఉంటే మజ్లిస్ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందని చెప్పాయి. మేయర్ పీఠంను టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంటుందని చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ...ఓటర్ తీర్పు మాత్రం బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమై ఉంది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.

GHMC Election Results 2020 Live Updates in Telugu:Which party will bag the Mayor post

ఇక గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల కౌంటింగ్‌పై మినిట్-టూ- మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Newest First Oldest First
9:48 PM, 4 Dec

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్:56,బీజేపీ: 48, ఏఐఎంఐఎం:44, కాంగ్రెస్:2
9:03 PM, 4 Dec

గ్రేటర్‌లో టీడీపీకి సున్నా సీట్లు..106 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ
8:53 PM, 4 Dec

గ్రేటర్ ప్రజలు దుష్ప్రచారాన్ని నమ్మలేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
8:47 PM, 4 Dec

తెలంగాణలో టీఆర్ఎస్‌కు కాలం చెల్లినట్లే: డీకే అరుణ
8:29 PM, 4 Dec

గ్రేటర్‌లో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ
8:28 PM, 4 Dec

మరో పాతిక సీట్లు ఎక్కువ వస్తాయని భావించాం అవి రాలేదు: కేటీఆర్
8:27 PM, 4 Dec

ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..టీఆర్ఎస్ పార్టీని అతిపెద్ద పార్టీగా నిలిపినందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను: మంత్రి కేటీఆర్
8:26 PM, 4 Dec

పది పన్నెండు సీట్లలో చాలా తక్కువ మెజార్టీతో ఓటమిపాలవడం జరిగింది. ఇందులో నిరాశపడాల్సిన పనిలేదు:కేటీఆర్
8:25 PM, 4 Dec

ఫలితం మేం ఆశించిన విధంగా రాలేదు.. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాయి: మంత్రి కేటీఆర్
8:25 PM, 4 Dec

జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీ విజయానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నా: కేటీఆర్
8:16 PM, 4 Dec

బీజేపీ వల్లే అభివృద్ధి సాధ్యమని ప్రజలు ఓటు వేశారు.. మేము అడ్డదారిలో మేయర్ పదవి కావాలని కోరుకోవడం లేదు: బండి సంజయ్
7:43 PM, 4 Dec

బీజేపీ రాష్ట్రకార్యాలయం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత కమలం పార్టీ నేతల సంబరాలు
7:30 PM, 4 Dec

బంజారాహిల్స్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కేకే కుమార్తె విజయలక్ష్మీ విజయం
7:28 PM, 4 Dec

వివేకానంద నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం రోజా విజయం
7:10 PM, 4 Dec

గ్రేటర్ తీర్పు ప్రభుత్వ పనితీరుకు రిఫరెండం: బండి సంజయ్
7:09 PM, 4 Dec

టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా
6:52 PM, 4 Dec

దుబ్బాకలో అల్లుడి సంగతి చూసిన ప్రజలు..జీహెచ్ఎంసీలో కొడుకు పని పట్టారు: బండి సంజయ్
6:50 PM, 4 Dec

బీజేపీ విజయం భాగ్యలక్ష్మీ అమ్మవారి దయవల్లే దక్కింది: బండిసంజయ్
6:50 PM, 4 Dec

రాష్ట్రంలో పెనురాజకీయ మార్పులు ఖాయం: లక్ష్మణ్
6:49 PM, 4 Dec

ప్రజాసమస్యలపై పోరాటం చేస్తాం: బండి సంజయ్
6:48 PM, 4 Dec

గ్రేటర్‌లో విజయం కార్యకర్తల కృషి: బండి సంజయ్
6:48 PM, 4 Dec

టీఆర్ఎస్‌కు రోజులు దగ్గరపడ్డాయి.. ఇవే టీఆర్ఎస్‌కు చివరి ఎన్నికలు: లక్ష్మణ్
6:47 PM, 4 Dec

కాసేపట్లో రాజీనామాపై ఉత్తమ్ ప్రకటన చేసే అవకాశం
6:46 PM, 4 Dec

గ్రేటర్‌లో రెండు డివిజన్లకు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్
6:46 PM, 4 Dec

గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ టీపీసీసీ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
6:46 PM, 4 Dec

టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ గుడ్ బై..?
6:35 PM, 4 Dec

ముషీరాబాదులో బీజేపీ అభ్యర్థి సుప్రియ విజయం
6:32 PM, 4 Dec

66 స్థానాలు కూడా టీఆర్ఎస్ దక్కించుకోకపోతే మజ్లిస్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది
6:29 PM, 4 Dec

బల్దియా బాద్షా ఎవరు..? మ్యాజిక్ ఫిగర్‌కు దూరంలో టీఆర్ఎస్. కీలకం కానున్న ఎక్స్ అఫిషియో ఓట్లు
6:20 PM, 4 Dec

బేగంబజార్‌లో బీజేపీ అభ్యర్థి శంకర్ యాదవ్ విజయం
READ MORE

English summary
Hyderabad GHMC Election Results 2020 Live Updates in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X