• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పాతబస్తీపైనా కమలం ఆధిపత్యం: ఓల్డ్ సిటీ కోటపై కాషాయ పతాకం?: మజ్లిస్ వెనుకంజ

|

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రారంభ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా దూసుకెళ్తోంది. కారు జోరుకు బ్రేక్ వేసింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో మెజారిటీ డివిజన్లలో ఆధిపత్యాన్ని కనపరిచిన కమలనాథులు.. పాతబస్తీలోనూ అదే హవాను కొనసాగించారు. ఓల్డ్ సిటీ పరిధిలోని అనేక డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు మెజారిటీని సాధించారు. కీలక డివిజన్లలో అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ రెండో స్థానంలో పరిమితం కావడం హైలైట్‌గా మారింది. జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

GHMC Exit Polls అంచనా తలకిందులవుతాయా: ప్రారంభ ఫలితాల్లో కమల వికాసం: స్పీడు తగ్గిన కారు

జోరుగా ఓట్ల లెక్కింపు..

జోరుగా ఓట్ల లెక్కింపు..

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. ఇంకాస్సేపట్లో తొలి ఫలితం వెల్లడి కావచ్చు. మెహదీపట్నం డివిజన్‌కు సంబంధించిన ఫలితం మొట్టమొదటగా వెలువడుతుందని అంటున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును చేపట్టారు. అవి ముగిసిన వెంటనే మిగిలిన ఓట్లను లెక్కిస్తారు. గెలిచిన అభ్యర్థులు గానీ, వారి అనుచరులు గానీ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విజయోత్సవ ర్యాలీలను నిర్వహించడానికి అనుమతి లేదు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ర్యాలీలు, ప్రదర్శనలను నిషేధించారు.

పాతబస్తీపైనా కమలం ఆధిపత్యం..

పాతబస్తీపైనా కమలం ఆధిపత్యం..

ప్రారంభ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడును ప్రదర్శించింది. తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి రెండో స్థానానికి నెట్టేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మెజారిటీ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులకు అనూహ్యంగా ఆధిక్యత లభించింది. ఇదే తరహా వాతావరణం పాతబస్తీలోనూ కనిపించింది. పలు డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రారంభ ఫలితాల్లో లీడ్‌లో నిలిచారు.

మజ్లిస్ కోటలో

మజ్లిస్ కోటలో

నిజానికి- పాతబస్తీ మజ్లిస్‌కు కంచుకోట. హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పూర్తి పెత్తనాన్ని చలాయిస్తోన్న ప్రాంతం ఇది. మైనారిటీ ఓట్ల శాతం అధికంగా ఉండటం వల్ల సహజంగానే.. మజ్లిస్‌కు ఓట్లు బదలాయింపు అవుతుంటుంది. ఈ సారి మాత్రం ఆ పరిస్థితులు లేవని ప్రారంభ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. పాతబస్తీలో ప్రస్తుతానికి ఎంఐఎం 17 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోండగా.. మిగిలిన వాటిల్లో మెజారిటీ స్థానాల్లో బీజేపీ పైచేయి సాధించింది. కొన్ని టీఆర్ఎస్ లీడ్‌లో ఉంది. 2016 నాటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ ఇక్క ఏకపక్షంగా విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

  GHMC Election Results: first result may come on ghmc mehdipatnam division.
  టీఆర్ఎస్ వెనుకంజలో

  టీఆర్ఎస్ వెనుకంజలో

  మజ్లిస్‌కు 44 డివిజన్లు దక్కాయి. ఈ సారి ఆ పరిస్థితులు లేకపోవచ్చు. బీజేపీ గట్టిపోటీ ఇస్తోంది. అత్యధిక డివిజన్లను మజ్లిస్ గెలుచుకున్నప్పటికీ.. దాని ఓట్ల శాతం మాత్రం గణనీయంగా తగ్గొచ్చని ప్రారంభ ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా బీజేపీ గాలి వీస్తోంది. అధికార టీఆర్ఎస్‌ను వెనక్కి నెట్టింది. ఉదయం 10:30 గంటలకు వరకు అందిన సమాచారం ప్రకారం.. బీజేపీ-84 డివిజన్లలో ఆధిక్యతలో కొనసాగుతోండగా.. టీఆర్ఎస్ 30 చోట్ల పైచేయిని సాధించింది. ఇదే దూకుడు, ఆధిక్యతను మున్ముందు ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

  English summary
  Hyderabad GHMC Election Results 2020 Live Updates in Telugu: Early trends show that All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) headed by Asaduddin Owaisi is behind race. BJP leads in divisions of Old City.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X