హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

GHMC Election Results 2020: 11 గంటల తర్వాతే ఫస్ట్ రిజల్ట్.. ఫలితం అక్కడే..

|
Google Oneindia TeluguNews

కాసేపట్లో గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 150 డివిజన్లకు సంబంధించి ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతోంది. బ్యాలెట్ పద్దతిన లెక్కించాల్సి ఉన్నందున సాయంత్రం ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల తర్వాత మొదటి రౌండ్‌ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడతాయని గ్రేటర్ అధికారులు చెబుతున్నారు.

Recommended Video

GHMC Election Results: first result may come on ghmc mehdipatnam division.

గ్రేటర్ ఫలితాల వేళ భారీ ట్విస్ట్ -రీపోలింగ్‌పై హైకోర్టు సూచన -ఎక్స్ అఫీషియో ఓట్లపై నోటీసులుగ్రేటర్ ఫలితాల వేళ భారీ ట్విస్ట్ -రీపోలింగ్‌పై హైకోర్టు సూచన -ఎక్స్ అఫీషియో ఓట్లపై నోటీసులు

1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

గ్రేటర్‌లో 1,926 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి. కౌంటింగ్‌ వరకూ వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుని, తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌ పూర్తి చేస్తారు. అనంతరం బ్యాలెట్‌ బాక్సులను తెరుస్తారు. 30 సర్కిళ్లలోని 30 ప్రదేశాల్లో లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు. ప్రతి హాల్‌లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 1000 ఓట్ల లెక్కింపు వంతున ఒక రౌండ్‌లోనే 14 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.

28 వేల లోపు ఓట్లు..

28 వేల లోపు ఓట్లు..

సిటీలోని మెజారిటీ డివిజన్లలో 28 వేలలోపు ఓట్లు పోలయ్యాయి. రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని హాళ్లలో గరిష్ఠంగా మూడు రౌండ్‌లలో లెక్కింపు పూర్తి కానుంది. 11 వేల ఓట్లు పోలైన మెహిదీపట్నం ఫలితం ఒకే రౌండ్‌లోనే రానుంది.

గంట నుంచి గంటన్నర సమయం..

గంట నుంచి గంటన్నర సమయం..

ఒక్కో రౌండ్‌ ఓట్ల లెక్కింపునకు గంట నుంచి గంటన్నర సమయం పట్టనుంది. లెక్కింపులో 8,152 మంది సిబ్బంది పాల్గొంటుండగా.. 31 మంది ప్రక్రియను పరిశీలిస్తారు. సీసీటీవీ కెమెరాలతో లెక్కింపును రికార్డు చేయనున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద కూడా కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి టేబుల్‌ వద్ద శానిటైజర్‌ అందుబాటులో ఉంటుంది. అధికారులు, ఏజెంట్‌లు విధిగా మాస్కు ధరించాల్సి ఉంటుంది.

English summary
Hyderabad GHMC Election Results 2020 Live Updates in Telugu: first result come on ghmc mehdipatnam division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X