హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్వకుంట్ల కవిత ధీమా అదే: వందకు పైగా డివిజన్ల మావే: ఆ రెండు పార్టీలకూ పరాభవమే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును చేపట్టారు. అవి ముగిసిన వెంటనే మిగిలిన ఓట్లను లెక్కిస్తారు. సాయంత్రానికి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది .గెలిచిన అభ్యర్థులు గానీ, వారి అనుచరులు గానీ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విజయోత్సవ ర్యాలీలను నిర్వహించడానికి అనుమతి లేదు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ర్యాలీలు, ప్రదర్శనలను నిషేధించారు.

Recommended Video

GHMC Election Results 2020 : ఇదివరకటి కంటే అధిక డివిజన్లను గెలుచుకుంటాం! - MLC Kalvakuntla Kavitha

ఈ ఎన్నికల్లో తాము వందకు పైగా డివిజన్లను గెలుచుకుంటామని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజలు అభివృద్ధి పట్టం కట్టబోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాయకత్వాన్ని బలపరిచారని పునరుద్ఘాటించారు. ఇదివరకటి కంటే అధిక డివిజన్లను గెలుచుకుంటామని, టీఆర్ఎస్‌పై ప్రజలు తమ నమ్మకాన్ని కోల్పోలేదని చెప్పారు.

GHMC Election Results 2020: Live Updates in Telugu: We are expecting to win over 100 seats: K Kavitha

భారతీయ జనతా పార్టీ రెండో స్థానం కోసమే ఎన్నికల్లో పోరాడిందని కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య రెండో స్థానం కోసం పోరాటం సాగిందని ఆమె వ్యాఖ్యానించారు. హస్తిన నుంచి బీజేపీ అగ్ర నేతలు ఎన్నికల్లో ప్రచారం చేశారని, అయినా వారికి ఎదురుదెబ్బ తప్పదని జోస్యం చెప్పారు. హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా, సర్వతోముఖంగా అభివృద్ధి చేసే శక్తిసామర్థ్యాలు తమ పార్టీకి మాత్రమే ఉన్నాయని కవిత చెప్పారు. మినీ ఇండియాగా పేరున్న హైదరాబాద్‌లో బీజేపీ నేతలు మత రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

జేపీ నడ్డా, అమిత్ షా, స్మృతి ఇరానీ, తేజస్వి సూర్య వంటి అగ్రనేతలు మకాం వేసి, మరీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి తాము ఏకపక్షంగా గెలవబోతున్నామనేదే ప్రధాన కారణని అన్నారు. వారు ఇచ్చిన హామీలను హైదరాబాదీయులు ఏ మాత్రం విశ్వసించలేదని తేల్చి చెప్పారు. అమలు కాని హామీల పట్ల హైదరాబాద్ వాసులు మొగ్గు చూపలేదని, కేసీఆర్ సారథ్యాన్నే వారు బలపరిచారని కవిత పేర్కొన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ, కాంగ్రెస్‌‌కు చెంపపెట్టుగా మారుతాయని వ్యాఖ్యానించారు.

English summary
Hyderabad GHMC Election Results 2020 Live Updates in Telugu: TRS leader and MLC Kalvakuntla Kavitha told that we are expecting to win more than 100 seats. People of Hyderabad did not believe in them and reposed their faith in KCR's leadership, she said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X