హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్‌ ఎన్నికలు... ఆ ఒక్క చోట కౌంటింగ్ నిలిపివేత... ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఒక్క స్థానం మినహా అన్ని స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. నేరెడ్‌మెట్‌లో ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు. బ్యాలెట్‌‌ పేపర్‌పై స్వస్తిక్‌కి బదులు ఇతర ముద్ర ఉన్న ఓట్లు ఎక్కువగా ఉండటంతో హైకోర్టు ఆదేశాల మేరకు లెక్కింపును నిలిపివేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. నేరెడ్‌మెట్ ఎన్నికల నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి పంపినట్లు తెలిపారు.

కాగా,ఈసారి గ్రేటర్‌లో పోలింగ్‌లో కొన్నిచోట్ల స్వస్తిక్ ముద్రకు బదులు పోలింగ్ కేంద్రం సంఖ్యను తెలిపే ముద్రను ఓటర్లకు ఇచ్చామని... కాబట్టి వాటిని కూడా ఓట్ల లెక్కింపులో పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల కమిషన్ గురువారం(డిసెంబర్ 3) అర్ధరాత్రి సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించగా... స్వస్తిక్ మినహా ఇతర ముద్రలు కలిగి ఉన్న ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని కోర్టు సూచించింది. ఒకవేళ గెలుపోటములు ఆ ఓట్లపై ఆధారపడి ఉంటే... దానిపై ప్రత్యేక ఆదేశాలిస్తామని చెప్పింది.

ghmc election results 2020 neredmet counting stayed by court order

ఈసారి గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడింది. ఓటర్లు ఏ పార్టీకి మెజార్టీ కట్టబెట్టలేదు. మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్‌ 55 డివిజన్లలో గెలుపొందగా, బీజేపీ 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. దుబ్బాక ఉపఎన్నికతో దూకుడు మీదున్న బీజేపీకి గ్రేటర్ ఎన్నికల ఫలితాలు మరింత బూస్టింగ్ ఇచ్చాయి.బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ' ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో అభివృద్ధే లక్ష్యంగా సాగిస్తున్న బిజెపిరాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు' అని అమిత్ షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి అమిత్ షా అభినందనలు తెలిపారు.

అటు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... గ్రేటర్‌‌ ఫలితం తాము ఆశించినట్లుగా రాలేదన్నారు. టీఆర్ఎస్‌కు మరో 20 సీట్లు ఎక్కువ వస్తాయని ఆశించామన్నారు. 12 డివిజన్లలో స్వల్ప తేడాతో ఓటమి చెందామన్నారు. ఫలితాలపై నిరాశ చెందాల్సిన అవసరం లేదన్న కేటీఆర్... మేయర్‌ పీఠంపై కూర్చునేందుకు రెండు నెలల సమయం ఉందని పేర్కొనడం గమనార్హం.

Recommended Video

GHMC Results : Uttam Kumar Reddy Resigns As chief Of Telangana Congress

English summary
Neredmet election counting was stayed by highcourt order as there voters used another symbol instead of swasthik.Neredmet is a ward in the Greater Hyderabad Municipal Corporation. The reservation status for this ward is Women. There are a total of 56,092 eligible voters in this ward of which 28,135 are male, 27,955 female and 2 are of the third gender.There are 63 polling stations in this ward. Neredmet is part of Malkajgiri circle and Secunderabad zone of the Greater Hyderabad Municipal Corporation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X