హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్పొరేటర్ అభ్యర్థి భర్త చావు తెలివితేటలు: షూ లో మొబైల్, గుర్తించి.. వెనక్కి పంపించిన సిబ్బంది

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్స్ అనుమతించడం లేదు. బయటకి సమాచారం ఇస్తారని, డిస్టర్బెన్స్ ఎందుకు అని నిర్ణయం తీసుకున్నారు. కానీ కొందరు కార్పొరేటర్ అభ్యర్థులు/ వారి భర్తలు, ఏజెంట్లు మాత్రం సరిగా విన్నట్టు లేదు. ఎలాగైనా మొబైల్ తీసుకురావాలని భావించారు. అందుకోసం ఒకరు ఏకంగా షూ లో ఫోన్ పెట్టుకొని అడ్డంగా దొరికిపోయారు.

 GHMC Election Results 2020: ఓయూ డీఆర్సీ వద్ద ఉద్యోగుల ఆందోళన, ఎందుకంటే.. (వీడియో) GHMC Election Results 2020: ఓయూ డీఆర్సీ వద్ద ఉద్యోగుల ఆందోళన, ఎందుకంటే.. (వీడియో)

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎంఐఎం అభ్యర్థి షాహీనా బేగం భర్త షరీఫుద్దీన్ షూలో సెల్ ఫోన్ పెట్టుకుని కౌంటింగ్ కేంద్రంలో వచ్చాడు. నిబంధనల ప్రకారం కౌంటింగ్ హాల్లో సెల్ ఫోన్లు నిషేధం. ఎవరూ గుర్తించకుండా షరీఫుద్దీన్ తన బూటులో సెల్ ఫోన్ పెట్టుకుని కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించాడు. గమనించిన పోలీసులు అతడిని వెంటనే కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతం నుంచి వెలుపలికి తీసుకువచ్చారు. అనంతరం అతడిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

GHMC Election Results 2020: police has taken man who put his mobile in shoe

యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటన కలకలం రేపింది. ఇక ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే టీఆర్ఎస్ 11 డివిజన్లలో విజయం సాధించింది. మరో 47 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం 16 డివిజన్లలో విజయం సాధించింది, మరో 16 డివిజన్లలో ముందంజలో ఉంది. బీజేపీ 38 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీకి ఒక డివిజన్ లో విజయం వరించింది.

English summary
Hyderabad GHMC Election Results 2020: police has taken man who put his mobile in shoe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X