హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా తిరస్కరణ: ఉప్పల్ నియోజకవర్గంలోనే 137.. మిగతా చోట్ల కూడా..

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా అధికంగా తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఓటు వేసిన ఉద్యోగులు/ వృద్దులకు అవగాహన కొరవడిందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. గ్రేటర్ పోలింగ్‌ బ్యాలెట్ పద్దతిన జరిగిన సంగతి తెలిసిందే. దీంతో స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది. అంటే బ్యాలెట్ పద్ధతిలో కూడా భారీగా ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి అని తెలుస్తోంది. స్వస్తిక్ కాకుండా మార్క్ కనిపించినా.. ఓటుగా పరిగణిస్తామని ఎస్ఈసీ సర్కులర్ జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించడంతో.. స్వస్తిక్ కనిపిస్తేనే ఓటుగా పరిగణించాలని స్పష్టంచేసింది. దీంతో స్వస్తిక్ గుర్తు లేని ఓట్లు భారీగా తిరస్కరణకు గురయినట్టు సమాచారం.

Recommended Video

GHMC Election Results : Many postal ballot votes Rejected

ఎన్నికల విధుల్లో ఉండే అధికార, ఉద్యోగ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌లో తిరస్కరణకు గురైన ఓట్లు భారీగా తిరస్కరణకు గురయ్యాయి. ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పది డివిజన్లలో మొత్తం 137 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. అయితే వాటిల్లో 48 తిరస్కరణకు గురయ్యాయి. ఒక ఉప్పల్ కాదు చాలా చోట్ల ఇలానే జరిగాయి. అంటే 1900 పై చిలుకు ఓట్లలో తిరస్కరణకు గురయిన ఓట్లు భారీగానే ఉండనున్నాయి.

GHMC Election Results 2020: Rejection of postal ballot votes is high in ghmc

కాప్రా డివిజన్‌లో నాలుగు, ఎ ఎస్ రావు నగర్‌లో ఏడు, చర్లపల్లి డివిజన్‌లో ఐదు, మల్లాపూర్‌లో ఏడు, నాచారంలో ఆరు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి, ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని చిల్కానగర్‌లో ఐదు, హబ్సిగూడలో మూడు, రామంతాపూర్‌లో ఒకటి, ఉప్పల్‌లో అత్యధికంగా పది ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగతా చోట్ల కూడా ఇదే మాదిరిగా తిరస్కరణకు గురయ్యాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం కనబరిచిన సంగతి తెలిసిందే.

English summary
Hyderabad GHMC Election Results 2020: Rejection of postal ballot votes is very high in ghmc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X