హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

GHMC Election Results 2020: స్వస్తిక్‌ గుర్తు ఉంటేనే ఓటు.. తేల్చిచెప్పిన హైకోర్టు

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. స్వస్తిక్ సహా మార్క్, గీత ఉన్న ఓటును పరిగణలోకి తీసుకుంటామని గత అర్ధరాత్రి ఎస్ఈసీ ఉత్తర్వులు జారీచేశారు. దీనిని బీజేపీ హైకోర్టులో సవాల్ చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. ధర్మాసనం విచారించింది. స్వస్తిక్ గుర్తు ఉంటేనే ఓటుగా పరిగణించాలని స్పష్టంచేసింది. మార్క్/ గీత ఉంటే అదీ ఓటుగా తీసుకోవద్దని తేల్చిచెప్పింది. దీనికి సంబంధించి వెంటనే కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందజేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

గ్రేటర్ ఫలితాల వేళ భారీ ట్విస్ట్ -రీపోలింగ్‌పై హైకోర్టు సూచన -ఎక్స్ అఫీషియో ఓట్లపై నోటీసులుగ్రేటర్ ఫలితాల వేళ భారీ ట్విస్ట్ -రీపోలింగ్‌పై హైకోర్టు సూచన -ఎక్స్ అఫీషియో ఓట్లపై నోటీసులు

 తోసిపుచ్చిన హైకోర్టు..

తోసిపుచ్చిన హైకోర్టు..

ఇప్పటికే ఎస్ఈసీ జారీచేసిన సర్క్యులర్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనికి సంబంధించి తమ తుది ఉత్తర్వులకు లోబడి ఫలితాలు ఉండాలని ధర్మాసనం స్పష్టంచేసింది. హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కాస్త ఇబ్బందికి గురిచేశాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత గ్రేటర్‌లో బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించారు. కరోనా వైరస్ వల్ల ఈవీఎం కాకుండా.. బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించారు.

బీజేపీ లీడ్‌లో..

బీజేపీ లీడ్‌లో..

అయితే ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. విచిత్రంగా బీజేపీ లీడ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మరీ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో.. బ్యాలెట్ ఓట్ల ట్రెండ్ తెలుస్తోంది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లతో ఓటింగ్ ఎలా ఉండనుందో అనేది చర్చకు దారితీసింది.

Recommended Video

GHMC Election Results counting will begin at 8am
హైకోర్టు ఆదేశాలు..

హైకోర్టు ఆదేశాలు..

ప్రభుత్వ ఉద్యోగులు, వికలాంగులు, వృద్దులు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లను వేశారు. ఇప్పటివరకు బీజేపీ వైపు మొగ్గచూపగా.. రీ కౌంటింగ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనే చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోలేవని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ఆ మేరకు హక్కులు కల్పించిందని మేధావులు తెలిపారు. అవసరమైతే ఆ గుర్తులు ఉన్న చోట తిరిగి ఎన్నికలు జరపాలని కోర్టు కోరచ్చు కానీ.. కౌంటింగ్ నిలిపివేయాలని కోర్టు కోరవని స్పష్టంచేస్తున్నారు. కానీ హైకోర్టు ఆదేశాల జారీచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
Hyderabad GHMC Election Results 2020: swastik symbol is mandatory for vote high court said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X