హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ముందంజ: విజయంపై ఎవరిధీమా వారిదే.. పోలయిన ఓట్ల కంటే 200 ఎక్కువ

|
Google Oneindia TeluguNews

గ్రేటర్‌లో తొలి ఫలితం వెల్లడవుతోంది. 150 డివిజన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే 15 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ లీడ్‌లో ఉండగా.. బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ పరుగులు తీస్తోంది. అయితే చివరి గంటలో 18 శాతం ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఇతర పక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తప్పులు జరిగి ఉండొచ్చు అని చెబుతున్నాయి.

 గ్రేటర్‌ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల పర్వం... చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు... గ్రేటర్‌ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల పర్వం... చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు...

ఎవరిధీమా వారిదే..

ఎవరిధీమా వారిదే..

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు విజయానికి ప్రామాణికం కావు అని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఆయన చెప్పినట్టుగానే తొలి రౌండ్ ఫలితం వస్తోంది. టీఆర్ఎస్ లీడ్‌లో కొనసాగుతోంది. ప్రజల మద్దతు టీఆర్ఎస్ పార్టీకి ఉంది అని బొంతు రామ్మోహన్ చెప్పారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అని ఆయన విశ్వాసంతో ఉన్నారు. కానీ రాజాసింగ్ మాత్రం ఆయనతో విభేదిస్తున్నారు.

మేయర్ పీఠం

మేయర్ పీఠం

పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలే నిజమవుతాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. బీజేపీపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని ఆయన ధీమాతో ఉన్నారు. ప్రతి కౌంటింగ్ సెంటర్లలో బీజేపీకే ఓట్లు వస్తున్నాయని గుర్తుచేశారు. ట్రెండ్ ఎలా ఉన్నా సాయంత్రానికి బీజేపీకి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. బీజేపీ అభ్యర్థి మేయర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నాని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదని రాజాసింగ్ తెలిపారు.

 200 ఓట్లు ఎక్కువ.. తీసిన బ్యాలెట్ సీల్

200 ఓట్లు ఎక్కువ.. తీసిన బ్యాలెట్ సీల్

ఇటు కూకట్ పల్లి కేంద్రంలో ఆందోళన నెలకొంది. వివేకానంద డివిజన్‌లో పోలయిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు కనిపించాయని బీజేపీ అభ్యర్థులు చెబుతున్నారు. 63వ బూతులో 353 ఓట్లు పోలయ్యాయని చెప్పారు. కానీ ఇవాళ 574 ఓట్లు కనిపిస్తున్నాయని.. దాదాపు 200 ఓట్లు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఏఎం, ఆర్వో అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఇటు 76వ బూత్‌లో బ్యాలెట్ బాక్స్ సీల్ లేకుండా కనిపించిందని వివరించారు.

Recommended Video

GHMC Election Results 2020 : ఇదివరకటి కంటే అధిక డివిజన్లను గెలుచుకుంటాం! - MLC Kalvakuntla Kavitha

English summary
Hyderabad GHMC Election Results 2020: trs lead in ballot vote first round
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X