హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్‌లో టాప్ స్పీడ్‌లో కారు: మెజార్టీ మార్కునకు చేరువగా లీడ్.. కారు దూరంగా నిలిచిన కమలం

|
Google Oneindia TeluguNews

గ్రేటర్‌లో ఓటరు నాడీ తెలిసిపోతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకే భాగ్యనగర వాసులు జై కొట్టినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ సింగిల్‌గా 57 సీట్లలో లీడ్‌లో ఉంది. జీహెచ్ఎంసీలో 150 సీట్లు ఉండగా.. రూలింగ్ పార్టీ 60 నుంచి 70 సీట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా గులాబీ దండు మేయర్ పీఠం ఎగరేసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ అటు ఇటు అయినా ఎంఐఎం 31 సీట్లతో లీడ్‌లో ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్.. టీఆర్ఎస్, ఎంఐఎం పంచుకొని అధికారం చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Recommended Video

GHMC Election Results 2020 : గ్రేటర్ పీఠంపై ఎగరనున్న గులాబీ జెండా..!
దుబ్బాక వేరు.. గ్రేటర్ వేరు...

దుబ్బాక వేరు.. గ్రేటర్ వేరు...

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం మాదిరిగా గ్రేటర్ ప్రజలు కూడా తీర్పిస్తారనే ఊహాగానాలు నెలకొన్నాయి. కానీ దుబ్బాక వేరు.. బల్దియా వేరు అని సిటీ జనం నిరూపించారు. దాంతోపాటు చేసిన అభివృద్ధి, వర్ష బీభత్సం నేపథ్యంలో వరదసాయం కూడా అధికార పార్టీకి కలిసొచ్చింది. కానీ గతంలో 99 డివిజన్లు గెలిచినా టీఆర్ఎస్.. 20 నుంచి 30 స్థానాలు కోల్పోయే సిచుయేషన్ ఉంది. 2016లో కేవలం 3 డివిజన్లు గెలిచిన బీజేపీ.. ఈ సారి 20 నుంచి 30 డివిజన్లు గెలిచి బలంగా మారింది. ప్రస్తుతం 22 డివిజన్లలో లీడ్‌లో ఉంది. ఒకవిధంగా ఇదీ బీజేపీకి బూస్ట్ ఇచ్చే విషయమే.

ఎంఐఎం సత్తా..

ఎంఐఎం సత్తా..

2016లో ఎంఐఎం 44 డివిజన్లు గెలిచింది. ఈ సారి కూడా అటు ఇటుగా అదే స్థాయిలో దక్కించుకోనుంది. ప్రస్తుతం 31 డివిజన్లలో లీడ్‌లో కొనసాగుతోంది. పాతబస్తీలో మజ్లిస్ తన పట్టును నిలుపుకుంది. టీఆర్ఎస్ ఒంటరిగా బరిలోకి దిగినా.. తమ సత్తా మాత్రం చాటింది. ఇక కాంగ్రెస్ గత ఎన్నికల్లో 2 డివిజన్లు గెలవగా.. ఈ సారి 3 చోట్ల లీడ్‌లో ఉంది. అంటే ఆ పార్టీ సింగిల్ డిజిట్ దాటడం కష్టమే మరీ. ఇదివరకు బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరేసిన హస్తం.. తర్వాత క్రమంగా ప్రభ కోల్పోతోంది.

గులాబీ గుబాళింపు

గులాబీ గుబాళింపు

గ్రేటర్ ఎన్నికల్లో కొత్తగా మారేది ఏమీ లేదు. ప్రస్తుత ట్రెండ్ బట్టి చూస్తే టీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయం. అయితే అదీ ఒంటరిగా లేదంటే.. మజ్లిస్‌తో కలిసి అన్నదానిపై సాయంత్రం వరకు క్లారిటీ రానుంది. ఎలా అయినా గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరబోతోంది. జీహెచ్ఎంసీని దక్కించుకునేందుకు బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగిన ఫలితం లేకపోయింది.

English summary
Hyderabad GHMC Election Results 2020: trs lead in ghmc, mim also lead in 31 divisions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X