హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ghmc elections: గొడవలకు దిగితే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎవరైనా గొడవలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పోలింగ్ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

గ్రేటర్ పోల్స్: ఓటేసిన 80 ఏళ్ల వృద్ధురాలు, వారందరికి స్ఫూర్తి అంటూ కేటీఆర్ ప్రశంసగ్రేటర్ పోల్స్: ఓటేసిన 80 ఏళ్ల వృద్ధురాలు, వారందరికి స్ఫూర్తి అంటూ కేటీఆర్ ప్రశంస

కొండాపూర్ డివిజన్‌లో హఫీజ్‌పేట, ప్రేమ్ నగర్, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్టతోపాటు పలు డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల్ని పరిశీలించిన సజ్జనార్.. పోలింగ్ పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు.

ghmc elections 2020: CP sajjanar visits few polling centres

చెదురుమదురు ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని సజ్జనార్ తెలిపారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

కాగా, జీహెచ్ఎంసీ పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలకు దిగడంతో ఘర్షణ చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీలోని పోలింగ్ కేంద్రం 58 వద్ద, బంజరాహిల్స్ ఎన్జీనగర్ పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మరోవైపు నాచారం 6వ డివిజన్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఇంటిపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారని అధికార పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించిన ఈసీ

గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో మంగళవారం పోలింగ్ జరగాల్సి ఉండగా.. ఒక పొరపాటుతో ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్లో బుధవారం పోలింగ్ నిర్వహించునన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రేపు మలక్‌పేట్‌లో పోలింగ్ జరగనున్నందున.. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. బుధవారం ఓల్డ్ మలక్ పేట్ డివిజన్లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Recommended Video

GHMC Elections 2020 Polling Update గ్రేటర్ లో పోలింగ్ ప్రక్రియ ఎలా ఉందంటే...!!

English summary
ghmc elections 2020: CP sajjanar visits few polling centres.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X