హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

GHMC Election 2020 Live Updates: ఓల్డ్ మలక్‌పేట్‌లో సీపీఐ గుర్తు తారుమారు..ఆందోళనకు దిగిన సీపీఐ నాయకులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా... ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 50వేల మంది పోలీసులను పోలింగ్ బందోబస్తులో మోహరించారు. ప్రజలు స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఏదైనా ఇబ్బంది తలెత్తితే 9490617111కు సమాచారం అందించాలని రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌లో 84, సైబరాబాద్‌లో 38, రాచకొండ పరిధిలో 28, నగర పరిధిలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 50వేల మంది పోలీసులను బందోబస్తులో మోహరించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూమ్స్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

గ్రేటర్‌లో పోలింగ్‌కు సంబంధించి మినిట్‌-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం...

GHMC Elections 2020 Live updates: as the Campaign by all parties reach to another level

Newest First Oldest First
6:07 PM, 1 Dec

సాయంత్రం 6 గంటల సమయంలోగా క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం
6:07 PM, 1 Dec

ఈ నెల 4న గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
6:07 PM, 1 Dec

ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్..ఈనెల 3వ తేదీన ఓల్డ్ మలక్ పేట్‌లో రీపోలింగ్
5:34 PM, 1 Dec

సాయంత్రం 4 గంటల సమయానికి 30శాతం పోలింగ్ నమోదు
5:33 PM, 1 Dec

గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న సినీ హీరో రాజశేఖర్ ఆయన సతీమణి జీవిత
4:32 PM, 1 Dec

పోలింగ్‌కు గంటన్నర మాత్రమే సమయం ఉండగా ఇంకా పోలింగ్ బూతులకు పోటెత్తని ఓటర్లు
4:11 PM, 1 Dec

అమీర్‌పేట్‌లో 0.79 శాతం పోలింగ్..రెయిన్ బజార్‌లో అత్యల్పంగా 0.56శాతం పోలింగ్ నమోదు
4:10 PM, 1 Dec

పటాన్‌చెరులో 51.7శాతం పోలింగ్ నమోదు కాగా గుడిమల్కాపూర్లో 49.19శాతం నమోదైంది
3:56 PM, 1 Dec

మధ్యాహ్నం 3 గంటల సమయానికి కేవలం 25శాతం మాత్రమే నమోదైన పోలింగ్. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
2:30 PM, 1 Dec

జీహెచ్ఎంసీలో మందకొడిగా సాగుతున్న పోలింగ్. మధ్యాహ్నం 2:30 గంటల సమయం అవుతున్నప్పటికీ ఇంటి నుంచ బయటకు అడుగుపెట్టని ఓటర్లు
1:12 PM, 1 Dec

మందకొడిగా సాగుతున్న జీహెచ్ఎంసీ పోలింగ్. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18.20 శాతం పోలింగ్ నమోదు
12:48 PM, 1 Dec

హైదరాబాదులో ఓటు హక్కు వినియోగించుకున్న హీరో ఆనంద్ దేవరకొండ
12:46 PM, 1 Dec

గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న విజయ్ దేవరకొండ
12:26 PM, 1 Dec

ఓల్డ్ మలక్ పేట్‌లో పోలింగ్ రద్దు.. తిరిగి 3వ తేదీన రీపోలింగ్. గుర్తులు తారుమారవడంతో పోలింగ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం
12:24 PM, 1 Dec

తార్నాక డివిజన్‌లో టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ..ఉద్రిక్తంగా మారిన పరిస్థితి
11:41 AM, 1 Dec

బంజారాహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత
11:32 AM, 1 Dec

జీహెచ్ఎంసీలో మందకొడిగా పోలింగ్..ఉదయం 11 గంటలకు 8.90శాతం పోలింగ్ నమోదు
11:26 AM, 1 Dec

ఆర్కేపురంలో బీజేపీ టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్న బీజేపీ
11:13 AM, 1 Dec

ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి
10:45 AM, 1 Dec

మలక్ పెట్ లో సింబల్ మార్పు పై జిహెచ్ యంసి కమిషనర్ ను నివేదిక కోరిన రాష్ట్ర ఎన్నికల సంఘం, నివేదిక తర్వాత అక్కడ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం
10:45 AM, 1 Dec

ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌లో గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్‌ పత్రంలో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలికి బదులు, ఎదురుగా సీపీఎం అభ్యర్థి గుర్తు సుత్తి కొడవలి ఉంది. ఈవిషయమై ఎన్నికల అథారిటీ నివేదిక ఆధారంగా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోనుంది.
10:27 AM, 1 Dec

వెస్ట్ మారేడ్ పల్లి లోని కస్తూర్బా ఉమెన్స్ కాలేజీ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్.
9:58 AM, 1 Dec

గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం
9:46 AM, 1 Dec

ఓటు హక్కు వినియోగించుకున్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కుటుంబ సభ్యులు
9:46 AM, 1 Dec

ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ వద్ద క్యూలైన్లో నిల్చున్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కుటుంబ సభ్యులు
9:45 AM, 1 Dec

తెలంగాణ

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే శాంతిభద్రతల పరిరక్షణలో దిగిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. వినాయక్ నగర్ వార్డ్ నంబర్ 140లో బందోబస్తును పర్యవేక్షించారు.
9:42 AM, 1 Dec

మరో పోలింగ్ బూత్ లో ఓటు ఉండే అవకాశం ఉందని ..పోలింగ్ బూత్ అధికారులు చెప్పినప్పటికీ.. తమ ఓటు ఏ పోలింగ్ బూత్ లో అడిగినా లేదంటుంన్నారని నిరసన వ్యక్తం చేస్తున్న ఓటర్లు..
9:41 AM, 1 Dec

ఓటర్ స్లిప్ లు వచ్చినప్పటికీ.. ఓట్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్న ఓటర్లు
9:36 AM, 1 Dec

తెలంగాణ

జీహెచ్ఎంసీ పోలింగ్ సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్) శిఖా గోయెల్.
9:35 AM, 1 Dec

ఆన్ లైన్ ఓటర్ లిస్ట్ లో ఓటు ఉన్నప్పటికీ... పోలింగ్ బూత్ ఓటర్ లిస్ట్ లో డిలీట్ చూపెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఓటర్లు..
READ MORE

English summary
As the polling date for GHMC Elections 2020 is nearing, BJP is getting its top leaders like Amith shah, Yogi Aditya nath and others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X