• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దుబ్బాక దెబ్బ..గట్టిగా: ఫ్రీ..ఫ్రీ: టీఆర్ఎస్ ఉచిత వరాలు: గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో ఇదీ

|

హైదరాబాద్: సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నిక ఫలితం అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై తీవ్రంగా పడినట్టు కనిపిస్తోంది. అధికారంలో ఉండీ.. సొంత నియోజకవర్గాన్ని కాపాడుకోలేకపోయామనే కసి టీఆర్ఎస్ అగ్ర నేతల్లో వ్యక్తమౌతున్నట్టుగా ఉంది. అందుకే- దుబ్బాక తరహా ఫలితం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పునరావృతం కాకూడదనే పట్టుదల వారిలో నెలకొంది. అందుకే- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితం వరాల జల్లును ప్రకటించింది అధికార పార్టీ. వచ్చే నెల నుంచి ఆ ఉచిత వరాలను అమల్లోకి తీసుకుని రాబోతోన్నట్లు ప్రకటించింది.

మేనిఫెస్టోను విడుదల చేసిన కేసీఆర్..

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టోను గులాబీ బాస్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొద్దిసేపటి కిందట విడుదల చేశారు. ఇందులో కీలక హామీలను పొందుపరిచారు. అవన్నీ ఓటర్లకు గాలం వేసేవిగానే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాన్ని మరోసారి సవరిస్తామని, మారుతున్న కాలానికి అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దుతామని టీఆర్ఎస్.. తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. త్వరలోనే సమగ్ర జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందిస్తామని పేర్కొంది. ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేలా కొత్త జీహెచ్ఎంసీ చట్టం ఉంటుందని హామీ ఇచ్చారు.

20 వేల లీటర్ల లోపు వినియోగించే నివాసాలకు..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 10 లక్షల నల్లా కనెక్షన్లకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేస్తామని టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. నెలకు 20 వేల లీటర్ల లోపు మంచినీటిని వినియోగించే గృహ వినియోగదారులకు ఇది వర్తిస్తుంది. 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందిస్తామని, గృహ వినియోగదారులు ఒక్క రూపాయిని కూడా చెల్లించనక్కర్లేదని భరోసా ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో నివాసం ఉండే ెలకు 20 వేల లీటర్ల లోపు గృహ వినియోగదారులు డిసెంబర్ నుంచి నల్లా బిల్లులను చెల్లించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది.

మిగిలిన మున్సిపాలిటీలకూ

మిగిలిన మున్సిపాలిటీలకూ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ పథకం ఇచ్చే ఫలితాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉచితంగా మంచినీటిని సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తామని భరోసా ఇచ్చింది. 20 వేల లోపు పరిమితిని విధించడం వల్ల నీటిని దుబారా చేయడం తగ్గుతుందని, పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థికభారం ఉండబోదని టీఆర్ఎస్ అభిప్రాయపడింది. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని సూచించింది.

సెలూన్లకు ఉచిత విద్యుత్..

సెలూన్లకు ఉచిత విద్యుత్..

బీసీ ఓటును బ్యాంకును ప్రసన్నం చేసుకోవడంపై టీఆర్ఎస్ దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. నాయీ బ్రాహ్మణులకు ప్రయోజనం కలిగించి పథకాన్ని టీఆర్ఎస్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సెలూన్లకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. డిసెంబర్ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఉచిత విద్యుత్ సరఫరాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సీలింగ్‌ను ఉంచినట్లు కనిపించలేదు. సీలింగ్ ఉన్న విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచలేదు.

లాండ్రీ, దోభీఘాట్లకూ..

లాండ్రీ, దోభీఘాట్లకూ..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజక సామాజిక వర్గంపైనా టీఆర్ఎస్ వరాల జల్లును కురిపించింది. రాష్ట్రవ్యాప్తంగా క్రియాశీలకంగా పనిచేస్తోన్న దోభీఘాట్లను కూడా ఉచిత విద్యుత్ పరిధిలోకి తీసుకొచ్చింది. లాండ్రీలకూ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొంది. జంటనగరాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ధోబీ ఘాట్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. అవసరమైన ప్రాంతాల్లో అత్యాధునిక ధోబీ ఘాట్లను నిర్మించి ఇస్తామని గులాబీ పార్టీ హామీలను కురిపించింది.

  GHMC Elections 2020 : Nominations Are Closed,Clear Idea On Cadidates List By The End Of The Day
  వాహన పన్ను రద్దు..

  వాహన పన్ను రద్దు..

  జీహెచ్ఎంసీ పరిధిలో తాము అధికారంలోకి వస్తే.. చలాన్లను రద్దు చేస్తామంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీ ప్రభావమో ఏమో గానీ.. టీఆర్ఎస్ కూడా అదే తరహా వాగ్దానం ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి విధించిన లాక్‌డౌన్ సమయానికి సంబంధించిన మోటార్ వాహన పన్నును రద్దు చేస్తామని ప్రకటించింది. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఏడునెలల కాలానికి సంబంధించిన వాహన పన్నులను రద్దు చేస్తామని పేర్కొంది. దీని విలువ 267 కోట్ల రూపాయలు. గ్రేటర్ పరిధితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,37,611 ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు సంబంధించిన పన్నులను మానవతా దృక్పథం కింద మాఫీ చేయాలని నిర్ణయించామని అధికార పార్టీ పేర్కొంది.

  English summary
  Rulling Telangana Rashtra Samithi (TRS) released the Manifesto for the GHMC elections 2020. TRS manifesto highlights that Free water to households, free power to salons across Telangana State.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X