• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గ్రేటర్‌పై గులాబీ జెండా అంత ఈజీ కాదా?: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ: పరిహారం కోసం

|

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలు ఈ సారి అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి కఠిన సవాల్‌ను విసురుతున్నాయి. ఇదివరకట్లా వార్ వన్ సైడ్ అయ్యేలా కనిపించట్లేదు. విజయం సాధించడానికి చెమటోడ్చాల్సిన పరిస్థితి ఎదువుతోంది టీఆర్ఎస్ నేతలకు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా..పరాజయాన్ని చవి చూడాల్సిన పరిస్థితులను కల్పించింది.

మదరాసీ కమలా హ్యారిస్ బ్రెడ్‌ను వండిన విధంబెట్టిదనిన..: రెసిపీ ఇదీ: స్పైసీ పోర్క్ సాసెజ్మదరాసీ కమలా హ్యారిస్ బ్రెడ్‌ను వండిన విధంబెట్టిదనిన..: రెసిపీ ఇదీ: స్పైసీ పోర్క్ సాసెజ్

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఇదివరకే పేరుకుపోయిన సమస్యలు ఒక ఎత్తు కాగా.. మొన్నటి వరదలు మరో ఎత్తుగా మారాయి. విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హామీలు స్థాయి ఏమిటో ఆ వరదలు నిరూపించాయి. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను సముదాయించడం, వారిని టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయించేలా చేయడం.. అతిపెద్ద టాస్క్‌గా పరిణమించింది. బస్తీల్లో తిరుగుతోన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రతికూల పరిణామాలు ఎదురవుతోండటం ప్రజల ఆగ్రహానికి అద్దం పడుతోంది.

 GHMC elections 2020: TRS MLA Padma Rao faces the ire of local residents

తాజాగా టీఆర్ఎస్‌కు చెందిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తార్నాక డివిజన్ పరిధిలోని మాణికేశ్వరి నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీవాసులు ఆయనను అడ్డుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 10 వేల రూపాయల వరద సహాయం అందలేదని చెప్పారు. వాటిని ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అడ్డుగా ఉండటం వల్ల ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించలేకపోతోందని వివరించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే వరద సహాయం పంపిణీని పునఃప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. తమ బస్తీలోనే కొందరికి వరద సాయం మొత్తాన్ని ఇచ్చారని, మరి కొందరి ఇవ్వలేదనే విషయాన్ని వారు పద్మారావు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి ఒక్కరికీ వరదసాయం అందేలా తాను దగ్గరుండి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

English summary
Secunderabad MLA from TRS and Deputy Speaker Padma Rao faces the ire of residents of Manikeswaranagar in Tarnaka division. Basti residents stopped him and demanded pensions and flood relief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X