హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Video:ఓట్ల కోసం నేతల ఫీట్లు : చంటి పిల్లాడి డాష్ కడిగిన గులాబీ నేత... ఏడుస్తున్నా వదల్లేదు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: గ్రేటర్‌ ఎన్నికల వేళ నాయకుల పాట్లు అంతా ఇంతా కావు. ఓట్ల కోసం వారు చేసే ఫీట్లు ఒక్కోసారి ఔరా అనిపిస్తుంటే కొన్ని ఫీట్లు మాత్రం నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ఎన్నికలు వస్తే చాలు నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. ఈ ఒక్క సమయంలోనే వారికి అలవాట్లు లేని పనులన్నీ చేసేస్తారు. కొన్ని సన్నివేశాలు మాత్రం సినిమాల్లోనే కనిపిస్తాయి. ఇప్పుడు సినిమా తెరలు దాటి వాస్తవ రూపం దాలుస్తున్నాయి. తాజాగా ఇలాంటి సన్నివేశమే సోషల్ మీడియాను చుట్టేస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తెగ శ్రమిస్తున్నారు. చేతనైనవి, చేతకానివి కూడా చేసేస్తూ ఓటర్ల మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికలు వస్తే మన నాయకులు రంగంలోకి దిగుతారు. కొందరు రోడ్డు పక్కన ఉన్న బండిలో దోశలు వేస్తే.. మరికొందరు ఆ పక్కనే చెట్టు కింద ఉన్న ఇస్త్రీ దుకాణంలో బట్టలను ఇస్త్రీ చేస్తూ కనిపిస్తారు.

GHMC Elections 2020: Watch what this TRS leader is doing for votes,looks funny

మరికొందరైతే గోడలకు సున్నాలు వేస్తూ ఫోటోలకు ఫోజులిస్తారు. ఇప్పుడు కాస్త అప్‌డేట్ అయినట్లు ఉన్నారు. అసలే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. అందునా ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నారు. మరి అలాంటి సమయంలో ఓటరు ఎవరి వైపు నిలుస్తారో తెలియని నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మరో పని కూడా చేసేస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ చంటిపిల్లాడిది కడుగుతూ ఓ టీఆర్ఎస్ నేత కనిపించాడు. అంతేకాదు చంటి పిల్లాడు ఏడుస్తున్నప్పటికీ వదల్లేదు. ఒకవేళ వదిలితే ఓట్లు రావేమో అన్న ఫీలింగ్ ఈ నేతలో ఉన్నట్లుందని వీడియోను చూసిన నెటిజెన్లు కామెంట్స్ రాస్తున్నారు. మరీ ముడ్డి కడుగుతూ జై తెలంగాణ నినాదాలేంటంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను జనసేన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో కామెంట్స్ చూస్తే నవ్వొచ్చేలా ఉన్నాయి.

English summary
A video of TRS leaders cleaning a small kid is going viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X