హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ లో గులాబీ హవా.. పాలాభిషేకాలు , సంబరాలు షురూ .. గ్రేటర్ మేయర్ పీఠం టీఆర్ఎస్ దే ..

|
Google Oneindia TeluguNews

జిహెచ్ఎంసి ఎన్నికలలో మొదటి వెనక్కి వెళ్ళినట్టే వెళ్ళినా ప్రస్తుతం కారు జోరు చూపిస్తోంది. రివర్స్ గేర్ వేసింది అనుకున్న కార్ ఒక్క సారిగా రాయిన దూసుకుపోయింది. జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మొదటి లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ల లో కాస్త వెనుకబడింది టిఆర్ఎస్ పార్టీ, తొలి రౌండ్ ఫలితాలలో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికలలో 70స్థానాలలో లీడింగ్ లోకి వచ్చి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.

ఖాతా తెరిచిన కాంగ్రెస్ ... ఏఎస్ రావు నగర్ , ఉప్పల్ లో కాంగ్రెస్ విజయం ,డబీర్ పురా ఎంఐఎం ఖాతాలోఖాతా తెరిచిన కాంగ్రెస్ ... ఏఎస్ రావు నగర్ , ఉప్పల్ లో కాంగ్రెస్ విజయం ,డబీర్ పురా ఎంఐఎం ఖాతాలో

 టీఆర్ఎస్ పార్టీ 70 డివిజన్లలో ఆధిక్యం

టీఆర్ఎస్ పార్టీ 70 డివిజన్లలో ఆధిక్యం

ఇప్పటివరకూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐ ఎం 3 స్థానాలు ,టిఆర్ఎస్ పార్టీ రెండు స్థానాలు, కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకోగా బిజెపి చాలా స్థానాలలో హోరాహోరీగా టిఆర్ఎస్ పార్టీ తో పోరాటం చేస్తోంది. ఇప్పటివరకు ఒక్క స్థానంలో కూడా బిజెపి ఖాతా తెరవలేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ 70 డివిజన్లలో ఆధిక్యాన్ని కొనసాగిస్తుండగా బీజేపీ 30, ఎమ్ఐ ఎం 45 , కాంగ్రెస్ 4 స్థానాలలో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక దీంతో తాజాగా వినబడుతున్న ట్రెండ్స్ నేపథ్యంలో మరోసారి గ్రేటర్ హైదరాబాద్ గులాబీ ఖాతాలోనే పడుతుంది అన్న సంకేతాలు వెలువడుతున్నాయి .

చాలా డివిజన్లలో విజయానికి చేరువగా టీఆర్ఎస్

చాలా డివిజన్లలో విజయానికి చేరువగా టీఆర్ఎస్

కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, హస్తినాపురం , ఆల్వాల్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ ,బాలాజీ నగర్ లో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. హైదర్ గూడ , ఖైరతాబాద్, గౌతమ్ నగర్, బాలనగర్ , చందానగర్, అల్లాపూర్ లో కూడా టిఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. పటాన్ చెరువు, మచ్చ బొల్లారం, ఆల్వాల్, వెంకటాపురం, నేరేడ్మెట్, వినాయక నగర్ లలో ఆధిక్యంలో టిఆర్ఎస్ పార్టీ ఉంది. మొదట బిజెపికి అనుకూలంగా ఫలితాలు వచ్చినప్పటికీ, తరువాత అనూహ్యంగా టిఆర్ఎస్ పార్టీ పుంజుకుంది.

 సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు ... మొదలైన టీఆర్ఎస్ సంబరాలు

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు ... మొదలైన టీఆర్ఎస్ సంబరాలు

ప్రస్తుత 70 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యతను కొనసాగిస్తోంది.గ్రేటర్ ఫలితాలలో గులాబీ పార్టీకి అనుకూలంగా తీర్పు వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా

టిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటికే కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. ఈ ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ విజయబావుటా ఎగర వేస్తుందని, గ్రేటర్లో గులాబీ జెండా రెపరెపలాడుతుంది అని టిఆర్ఎస్ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. మరికాసేపట్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు విజయం తమదేనని సంబరాలు చేసుకుంటున్నారు.
రంగులు చల్లుకుంటూ , డ్యాన్సులు వేస్తూ హంగామా చేస్తున్నారు .

ఇప్పటివరకు ఇద్దరు టీఆర్ఎస్ నేతల విజయం

ఇప్పటివరకు ఇద్దరు టీఆర్ఎస్ నేతల విజయం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం టిఆర్ఎస్ పార్టీ సైతం బోణీ కొట్టింది . రెండు స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మెట్టుగూడా లో టిఆర్ఎస్ అభ్యర్థి రాసురి సునీత, యూసుఫ్ గూడా లో అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ విజయం సాధించారు . దీంతో టీఆర్ఎస్ ఖాతాలో రెండు స్థానాలు పడినట్లుగా అయింది. చాలా చోట్ల టీఆర్ఎస్ కు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఈసారి కూడా గ్రేటర్ మేయర్ పీఠం టీఆర్ఎస్ ఖాతాలోనే పడుతుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు .

English summary
The GHMC went as far back as the first in the election but now the car is pushing hard. The car, which was supposed to be in reverse gear, changed the gear in to OD . The GHMC election counting is going on thrillingly. The TRS party has come into the lead with 70 seats in the Greater elections and is continuing its lead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X