హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు..? రెండు, మూడురోజుల్లో నోటిఫికేషన్..

|
Google Oneindia TeluguNews

జీహెచ్ఎంసీ ఎన్నిక నగారా మోగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చేనెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీపావళి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తుండగా.. ఇటు రాజకీయ పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. విజయంపై ప్రధాన పార్టీలు అప్పుడే ధీమా వ్యక్తం చేశాయి.

డిసెంబర్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది. దుబ్బాక ఎన్నికలో అధికార పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ పడక ముందే గ్రేటర్ ఎన్నికలు జరపాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ గురువారం సమావేశం కానుంది. ఎన్నికల నిర్వహణ, ఓటర్ లిస్ట్, వార్డులపై చర్చిస్తోంది.

ghmc elections will be conduct december 4th sources said

పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య ఈసీ పరిశీలించింది. ఎన్నికల కోసం సిబ్బందికి శిక్షణను కూడా పూర్తి చేసింది. కరోనా నిబంధనలతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. దుబ్బాక ఓటమితో బల్దియాలో గెలవాలనే పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. బీజేపీ కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. ఎంఐఎంకి సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉండగా.. కాంగ్రెస్ కూడా మెజార్టీ సీట్లపై కన్నేసింది.

Recommended Video

KCR Review Meeting On Dubbaka Bypoll Result | BJP Focus On GHMC Election | Oneindia Telugu

గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి తమ పరువు నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకోసం భాగ్యనగర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటీవల కురిసిన వర్షాలను ప్రతిపక్షాలు ఎత్తిచూపనున్నాయి.

English summary
ghmc elections will be conduct december 4th sources said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X