హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జిహెచ్ఎంసీ తుది ఓటర్ల జాబితా విడుదల..వెబ్ సైట్ లో వివరాలు .. త్వరలో నోటిఫికేషన్

|
Google Oneindia TeluguNews

జిహెచ్ఎంసి ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా ఎన్నికల కమిషన్ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రకటించిన ఎన్నికల కమిషన్ త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోంది. దీంతో రాజకీయ పార్టీలు గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. అభ్యర్థుల ఎంపికపై బిజీగా ఉన్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి.

జీహెచ్ఎంసీపై పట్టు కోసం మెట్లు దిగుతున్న కేసీఆర్ .. మజ్లిస్ పార్టీతో మంతనాల ఆంతర్యం అదే!!జీహెచ్ఎంసీపై పట్టు కోసం మెట్లు దిగుతున్న కేసీఆర్ .. మజ్లిస్ పార్టీతో మంతనాల ఆంతర్యం అదే!!

వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన ఎన్నికల కమిషన్

వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన ఎన్నికల కమిషన్


గ్రేటర్ హైదరాబాద్ లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించిన ఎన్నికల కమిషన్, హైదరాబాద్ నగరంలోని 30 సర్కిల్ కార్యాలయాల్లోనూ, రెవెన్యూ కార్యాలయాలలోనూ, వార్డు కార్యాలయాల్లోనూ ఓటర్ల జాబితా ని ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో కూడా జాబితా ఉందని, ఓటర్ల జాబితాను చెక్ చేసుకుని ఎవరైనా తమ పేర్లు లేకుంటే, దరఖాస్తు ఫారం 6 ద్వారా సంబంధిత అసెంబ్లీ ఎలక్టోరల్ అధికారి వద్ద ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఎంత వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటన

పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటన

మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో 150 వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను కూడా సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను సర్కిల్ కార్యాలయాలు, వార్డ్, ఆర్ డి ఓ, తహసిల్దార్ కార్యాలయంలో ప్రదర్శించనున్నారు. పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా ఏమైనా అభ్యంతరాలు సలహాలు సూచనలు ఉంటే ఈ నెల 17 లోగా ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని పేర్కొన్నారు. ఈ క్లెయిమ్ లను పరిశీలించిన తర్వాత నవంబర్ 21 న సంబంధిత రిటర్నింగ్ అధికారులు తుది పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటిస్తారని పేర్కొన్నారు.

మొత్తానికి ఓటర్ల తుది జాబితా కూడా వెలువడటంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగారా మోగనుంది.

Recommended Video

Dubbaka Bypoll Result: CM KCR over GHMC Elections | Oneindia Telugu
ఎన్నికలకు రెడీ అవుతున్న రాజకీయ పార్టీలు ..

ఎన్నికలకు రెడీ అవుతున్న రాజకీయ పార్టీలు ..

త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అటు రాజకీయ పార్టీలు కసరత్తులు మొదలు పెట్టాయి. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పొత్తులపై సమాలోచనలు కూడా జరుగుతున్నాయి. ఈ సారి ఎలాగైనా వందకు పైగా స్థానాలు దక్కించుకోవాలని టిఆర్ఎస్ పార్టీ, గ్రేటర్ హైదరాబాద్ లో పట్టుకోవాలని బిజెపి, ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు టిడిపి కూడా గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

English summary
GHMC is making rapid strides towards elections. As part of that, the Election Commission released the final list of voters. The sector is preparing to issue a notification soon after the Election Commission announces the final voter list by ward in Greater Hyderabad. With this the political parties focused on the greater election. Are busy on the selection of candidates. Going forward with tactical counter-strategies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X