హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాంగోపాల్ వర్మకు బల్దియా షాక్: పవర్ స్టార్ పోస్టర్‌పై ఫైన్, 4 వేల జరిమానా విధించిన ఈవీడీఎం...

|
Google Oneindia TeluguNews

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రాం గోపాల్ వర్మ. లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడినా ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో పవర్ స్టార్ సినిమా రిలీజ్ చేసి లాభాలను ఆర్జిస్తున్నాడు. మీడియాను మీడియంగా వాడుకోవడంలో రాం గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా.. అయితే ఎప్పుడూ వార్తల్లో ఉండే వర్మకు ఈసారి బల్దియా షాక్ ఇచ్చింది. రూ.4 వేల ఫైన్ విధిస్తూ చలాన్ పంపించింది.

Recommended Video

GHMC Fine To Director Ram Gopal Varma Over Power Star Movie || Oneindia Telugu

రామ్ గోపాల్ వర్మకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వేసిన పోస్టర్‌కు సంబంధించి రూ.4 వేల ఫైన్ వేసింది. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి పోస్టర్‌ 'పవర్‌ స్టార్‌ ' సినిమాకు సంబంధించి రామ్‌ గోపాల్ ‌వర్మ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఒకరు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. సినిమాను ప్రమోట్‌ చేసేందుకు ప్రభుత్వ ఆస్తిని వినియోగించినందున ఫైన్‌ వేయాలని ఈవీడీఎం విభాగానికి తెలిపారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన ఈవీడీఎం విభాగం ఈ నెల 22వ తేదీన వర్మకు రూ.4 వేల జరిమానా విధిస్తూ చలాన్ జారీచేసింది.

ghmc fine to ram gopal varma over power star movie poster issue

పవర్ స్టార్ సినిమాను ఈ నెల 25 న దానిని ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌ లో విడుదల చేసాడు. పవన్ కళ్యాణ్ ‌పై సినిమా అంటూ వర్మ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. 37 నిమిషాల విడిదితో సినిమా తీయగా.. ఏముంటుందోనని పవన్ ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు. ఆర్జీవీ ఆఫీసుపై కూడా ప‌లువురు దాడికి పాల్పడ్డారు. అయితే మూవీలో రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎన్నిక ఫలితాల తరువాత పవన్ కల్యాణ్..అనుభవించిన మానసిక వేదనను మాత్రమే చూపించి.. క్యాష్ చేసుకున్నాడు.

English summary
ghmc fine to director ram gopal varma over power star movie poster issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X