హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దోమల మాయం అవుతాయా..? నివారణకు డ్రోన్ల‌ ప్రయోగం... రోజుకు 25ఎకరాల వరకు స్ప్రే...!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో దోమలు లేని ప్రాంతం ఉండదు..దోమలతోనే సకల రోగాలు వస్తాయనడంలో సందేహం లేదు. హైదరాబాద్ పరిస్థితులను వీటినీ కంట్రోల్ చేసేందుకు జీహెఎంసీ ఎన్ని చర్యలు తీసుకున్న దోమలు నిత్యకృత్యం అవుతున్నాయి. ఈనేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు వీటీ నిర్మూలను హైటెక్ ప్లాన్ వేశారు. దోమలను నివారించేందుకు డ్రోన్లను వాడుతున్నారు.

 డ్రోన్ల ద్వార దోమల నివారణ

డ్రోన్ల ద్వార దోమల నివారణ

దోమలు వీటిని నివారించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా వాటి ఉత్పత్తిని మాత్రం ఆపలేకపోతున్నాం. ఒక నిర్మూలిస్తే మరోచోట అవి ప్రత్యక్షమవుతాయి. దీంతో వాటి నివారణ కష్ట సాధ్యమవుతుంది.ఈనేపథ్యంలోనే దోమలను లార్వాదశలోనే చంపివేయడంతో పాటు వాటి స్థావరాలను సైతం నాశనం చేస్తే అసలు దోమల ఉత్పత్తి ఉండదనే అలోచనతో సరికొత్త ప్రయోగం చేపట్టారు. కాగా ఈ ప్రయోగాన్ని ఓ స్టార్టప్ కంపనీతో ప్రయోగత్మాకంగా చేపట్టారు.

జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం

జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం

ఇందులో భాగంగానే హైదారబాద్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపనీతో కలిసి దోమలకు నివారణకు ప్రణాలికలు రచించారు జీహెచ్ఎమ్సీ అధికారులు. దోమలను నివారించేదుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. డ్రోన్లలో బయో ఎంజైమ్స్ను నింపి దాన్ని చెరువుల్లో స్ప్రే చేయిస్తున్నారు. దీని ద్వార దోమలు చనిపోవడంతోపాటు లార్వా కూడ విచ్చిన్నం కానుందని చెబుతున్నారు. మరోవైపు చెరువుల్లో దీన్ని వేప ఆకులు, ఆవు పేడ, తో పాటు ఇతర మిశ్రమంతో ఈ స్ప్రే ను తయారు చేస్తున్నారు.అయితే ఈ దీని ద్వార దోమలతో పాటు దోమలకు ఆవాసాలుగా ఉండే చెట్లు సైతం మృతి చెందుతాయని వారు తెలిపారు. అనంతరం దోమలు కూడ అకస్మత్తుగా చనిపోతాయని అంటున్నారు..

మానవ వనరుల కంటే 1000 రెట్లు ఫాస్ట్

మానవ వనరుల కంటే 1000 రెట్లు ఫాస్ట్

అయితే ఇలాంటీ స్ర్రైను మనుష్యులతో చేయిస్తే చాల రోజులు పట్టే అవకాశాలు ఉండడంతో వాటిని స్ప్రే చేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.ఒకవేళ మనుష్యులతో గనుక చేయిస్తే మాత్రం కనీసం 25 రోజులు పడుతుందని చెబుతున్నారు.మరోవైపు ఇరవై మందికి పైగా ఈ పని చేయాల్సి ఉంటుందని వివరించారు.

రోజులో 25 ఎకరాల వరకు స్ప్రే

రోజులో 25 ఎకరాల వరకు స్ప్రే

కాగా డ్రోన్‌ల ద్వార 25 మంది చేసే పనిని కేవలం పది నిమిషాల్లో చెరువును పూర్తిగా మందును వెదజల్లడంతో ఒక్క రోజులో 25 ఎకరాల ప్రాంతాన్ని డ్రోన్స్ నువాడి దోమలను నివారించవచ్చని తెలిపారు. కాగా ఇలా గంటలో కనీసం అయిదు ఎకరాల ప్రాంతాన్ని ఇవి స్ర్ప్రే చేయనున్నాయి. వీటీ ద్వార సమయంతో పాటు డబ్బుకూడ ఆదా అవుతుండడంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

English summary
GHMC is using drones to eradicating of mosquitoes, as water bodiesare becomimg breeding and high risk areas for gengue, and malariacustom made drones are being used to spray.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X