హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిబంధనలు పాటించని 1600 ఆస్పత్రులకు జీహెచ్ఎంసీ నోటీసులు .... షైన్ ఆస్పత్రి ఘటనతో గుర్తొచ్చిందా !!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్లోని ఆసుపత్రులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చాయి. నిబంధనలు పాటించటం లేదు అని తెలిసినా ఎవరూ ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకోరు. ఏదైనా ప్రమాదం జరిగే వరకు ఏ శాఖల వాళ్ళు స్పందించరు. తాజాగా షైన్ పిల్లల ఆసుపత్రి లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నేపథ్యంలోనే ఇంతకాలం మొద్దు నిద్ర పోయిన శాఖలు స్పందిస్తున్నాయి. హైదరాబాద్లోని ఆసుపత్రుల్లో సేఫ్టీ ఉందా అన్నదానిపై విపత్తు నిర్వహణ విభాగం రంగంలోకి దిగింది. నిబంధనలు పాటించని ఆస్పత్రులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది.

ఫైర్ సేఫ్టీ పాటించని షైన్ ఆస్పత్రి.. చిన్నారుల మరణానికి అదే కారణం

ఫైర్ సేఫ్టీ పాటించని షైన్ ఆస్పత్రి.. చిన్నారుల మరణానికి అదే కారణం

ఎల్బీ నగర్ లోని షైన్ పిల్లల ఆసుపత్రి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఐ సి యూ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం ఒక చిన్నారి మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే షైన్ హాస్పిటల్ ఫైర్ సేఫ్టీ కి సంబంధించి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ను రెన్యువల్ చేయించుకోలేదని ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీకి చర్యలు తీసుకోలేదని గుర్తించిన అధికారులు ఆసుపత్రి ఎండి పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇక ఈ నేపధ్యంలోనే మిగతా ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఉందా అన్న దానిపై దృష్టి పెట్టింది.

ఫైర్ సేఫ్టీ లేని 1600 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చిన విపత్తు నిర్వహణా విభాగం

ఫైర్ సేఫ్టీ లేని 1600 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చిన విపత్తు నిర్వహణా విభాగం

షైన్ హాస్పటల్ అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో జిహెచ్ఎంసి ఆసుపత్రులపై దృష్టిసారించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ దృష్టికి హైదరాబాద్లోని చాలా ఆసుపత్రులు సరైన నియమ నిబంధనలను పాటించడం లేదని తెలిసింది. ఇక అంతే కాకుండా జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం సైతం ఆసుపత్రులలో ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అన్న అంశాలపై దృష్టి పెట్టింది. ఏకంగా 1600 ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ లేదు అంటే నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రుల తీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ ఆస్పత్రికి అయినా ముందుగా కావాల్సింది ఫైర్ సేఫ్టీ . ఆస్పత్రి భవనాల్లో ఫైర్ సేఫ్టీ ఉండాలి అనేది ముఖ్యమైన అంశం. కానీ హైదరాబాద్ లోని చాలా కార్పోరేట్ ఆస్పత్రులు నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

ఫైర్ సేఫ్టీ పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

ఫైర్ సేఫ్టీ పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక


నిబంధనలు పాటించకుండా ఆసుపత్రులను నిర్వహణ చేస్తున్నా జీహెచ్ఎంసీ మాత్రం చోద్యం చూస్తోంది. ఫలితంగా షైన్ ఆసుపత్రి అగ్ని ప్రమాదం లాంటి ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం కనిపిస్తుంది. అందుకే ఇకనుండి ఫైర్ సేఫ్టీ లేని ఆసుపత్రులను ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతూ 1600 ఆసుపత్రులకు విపత్తు నిర్వహణ విభాగం నోటీసులు జారీ చేసింది. ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీ కి సంబంధించి చర్యలు తీసుకోకుంటే కఠినంగా వ్యవహరిస్తామని, ఆసుపత్రులను సీజ్ చేస్తామని ఆ నోటీసులో పేర్కొంది.

ఎన్ఓసి తీసుకోని ఆస్పత్రులపై కొరడా ఝుళిపించటానికి రంగం సిద్ధం

ఎన్ఓసి తీసుకోని ఆస్పత్రులపై కొరడా ఝుళిపించటానికి రంగం సిద్ధం

నిబంధనలను అతిక్రమించి ఆసుపత్రుల నిర్వహణను చేస్తే సహించబోమని విపత్తు నిర్వహణ అధికారులు తేల్చి చెబుతున్న పరిస్థితి. మొత్తానికి షైన్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంతో మేలుకున్న విపత్తు నిర్వహణ అధికారులు ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగినా వాటిని వెంటనే ఎవరికి ఎలాంటి హాని లేకుండా అదుపు చేసేందుకు ఫైర్ సేఫ్టీ ఉండాలని చెప్తున్నారు. విపత్తు నిర్వహణ విభాగం నుండి, అగ్నిమాపక శాఖ నుండి ఫైర్ సేఫ్టీ పై నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండా ఆస్పత్రులను నిర్వహిస్తే ఊరుకోబోమని తేల్చి చెప్పింది డిజాస్టర్ మేనేజ్మెంట్.

English summary
It has come to the notice of the Greater Hyderabad Municipal Commission that many hospitals in Telangana have not been following the proper rules and regulations. Around 1600 hospitals in Telangana were served disaster management notices. One of the important safety measures i.e fire safety is missing in many hospitals. The authorities concerned are least bothered about the safety measures. The recent fire incident at Shine Children's Hospital is an example. Disaster Management officials have made it clear that they will not excuse any management of the hospitals, who defy the rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X