హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ కొత్త మేయర్‌ విజయలక్ష్మిపై మొదలైన విమర్శలు , మేయర్ అనుచరుడికి జీహెచ్ఎంసీ షాక్, భారీ ఫైన్

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరుడికి జిహెచ్ఎంసి అధికారులు షాక్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎన్నికైన తర్వాత మేయర్ విజయలక్ష్మి పేరుతో వెలసిన ఫ్లెక్సీలను తొలగించిన జిహెచ్ఎంసి అధికారులు, ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు విజయలక్ష్మి అనుచరుడు, టిఆర్ఎస్ నేత అతీష్ అగర్వాల్ కు 15 వేల రూపాయల జరిమానా విధించారు. మేయర్ గా ఆమె అనుచరులకు ఆదేశాలివ్వాలని , బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ విషయంలో ఆమెపై కూడా విమర్శలు వెల్లువగా మారుతున్నాయి .

Recommended Video

కొత్త మేయర్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు.. టీఆర్ఎస్ నేతకు రూ. లక్ష జరిమానా
మేయర్ పేరుతో ఉన్న ఫ్లెక్సీల తొలగింపు , ఇప్పటివరకు మూడు లక్షల 15 వేల రూపాయలు జరిమానా

మేయర్ పేరుతో ఉన్న ఫ్లెక్సీల తొలగింపు , ఇప్పటివరకు మూడు లక్షల 15 వేల రూపాయలు జరిమానా

జిహెచ్ఎంసి మేయర్ ఎన్నిక సందర్భంగా ప్రమాణ స్వీకారం రోజు శుభాకాంక్షలు తెలుపుతూ జిహెచ్ఎంసి పరిధిలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించిన సిబ్బంది ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు లక్షల 15 వేల రూపాయలు జరిమానా విధించినట్లుగా సమాచారం. ఫిబ్రవరి 11వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా శ్రీలత ఎన్నికయ్యారు. ఇక వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నగరంలో పలు చోట్ల అనుచరులు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

 జరిమానా విధించి టిఆర్ఎస్ నేతలకు షాక్ ఇచ్చిన అధికారులు

జరిమానా విధించి టిఆర్ఎస్ నేతలకు షాక్ ఇచ్చిన అధికారులు

అనధికారికంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై కొందరు ఫోటోలు తీసి జిహెచ్ఎంసి అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా అధికారులను నిలదీశారు.

దీంతో జిహెచ్ఎంసి పరిధిలో రంగంలోకి దిగిన అధికారులు అనధికారికంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో పాటుగా, జరిమానా విధించి టిఆర్ఎస్ నేతలకు షాక్ ఇచ్చారు. మేయర్ గా ఎన్నికైన రెండు రోజుల్లోనే మేయర్ అనుచరుడు అతీష్ అగర్వాల్ పై అధికారులు కొరడా ఝుళిపించారు. ఫ్లెక్సీలను తొలగించడమే కాకుండా భారీ జరిమానా విధించి షాకిచ్చారు.

పౌర నిబంధనలను ఉల్లంఘిస్తూ మేయర్ పేరుతో బ్యానర్లు

పౌర నిబంధనలను ఉల్లంఘిస్తూ మేయర్ పేరుతో బ్యానర్లు


హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికైన మరుసటి రోజు, జి విజయలక్ష్మి, ఆమె కేడర్ నగరంలో ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టిన తరువాత పౌర నిబంధనలను ఉల్లంఘిస్తూ, స్థానికులు, కార్యకర్తలు మరియు ప్రతిపక్ష సభ్యుల నుండి విమర్శలు వచ్చాయి. బంజారా హిల్స్‌లోని రోడ్ నెంబర్ 10 మరియు రోడ్ నం 12 పలు చోట్ల మేయర్ బ్యానర్లు , టిఆర్‌ఎస్ భవన్ పరిసరాల్లో కూడా బ్యానర్లు దర్శనం ఇచ్చాయి . ఈఎస్‌ఐ హాస్పిటల్ (ఎర్రగడ్డ) సమీపంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీ బ్యానర్లు కనిపించాయి.

జీహెచ్ఎంసీ మేయర్ పై అప్పుడే విమర్శల వెల్లువ

జీహెచ్ఎంసీ మేయర్ పై అప్పుడే విమర్శల వెల్లువ


గ్రేఅతర్ హైదరాబాద్ మేయర్ గా ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టకుండా మేయర్ తన కేడర్కు సూచించి ఉండాలి, కానీ ఆమె పేరుతో బ్యానర్లు ఏర్పాటు కావటంతో మేయర్ పై విమర్శలు వస్తున్నాయి . బంజారా హిల్స్ నుండి మేయర్‌పై పోటీ చేసి సుమారు 700 ఓట్ల తేడాతో ఓడిపోయిన బద్దం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ వేడుకలు బాధ్యతాయుతంగా జరగాల్సి ఉందని అన్నారు. మేయర్ ఎన్నిక సంబరాలు చేసుకోవచ్చు కానీ నిబంధనలు ఉల్లంఘించకూడదని పేర్కొన్నారు . మేయర్‌గా ఆమెకు ఎక్కువ బాధ్యత ఉండాలని పేర్కొన్న మహిపాల్ రెడ్డి గతంలో తమపై ఫైన్స్ వేశారని గుర్తు చేశారు .

English summary
Officials of the Greater Hyderabad Municipal Corporation (GHMC) have sent notices asking to pay Rs 3.15 lakh as fine for installing flexis of the newly elected GHMC Mayor Gadwal Vijayalakshmi. The flexis were erected in Banjara Hills and Jubilee Halls after she was elected as mayor with the support of the MIM. Imposing fine for setting up flexis has become a hot topic in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X