• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కాదేదీ దోపిడీకి అనర్హం : కలుగుల్లో "ఎలుకలు".. కాంట్రాక్టర్ జేబులో "లక్షలు"

|

హైదరాబాద్ : కాదేదీ కవితకు అనర్హం.. ఇది ఓల్డ్ వెర్షన్. మరి కొత్త ట్రెండ్ ఏంటనుకుంటున్నారా? కాదేదీ దోపిడీకి అనర్హం అనేది లేటేస్ట్ థింగ్. ఇదంతా కొందరి ప్రభుత్వాధికారుల తీరుకు నిదర్శనం. అధికారం అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఖజనాకు తూట్లు పొడుస్తున్న వైనం.

అధికారం చేతిలో ఉంటే కొండమీది కోతినైనా దించేయొచ్చని మరోసారి నిరూపించింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ యంత్రాంగం. కలుగుల్లో ఉండే ఎలుకల పేరు చెప్పి లక్షలకు లక్షలు కాజేస్తున్న వైనం వెలుగుచూడటం గమనార్హం.

ఎలుక ఎలుక దొరకవా?

ఎలుక ఎలుక దొరకవా?

ఎలుకల బెడదకు చెక్ పెట్టాలంటే మహా అయితే ఏం చేస్తారు. ఏదో మార్కెట్లో దొరికే మందు కొనుక్కొచ్చి వాటిని చంపేస్తుంటారు. కానీ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు ఎలుకల పేరు చెప్పి ఏకంగా లక్షల రూపాయలు వృధా చేస్తున్నారు. లిబర్టీ చౌరస్తాలోని ప్రధాన కార్యాలయంలో ఎలుకల బెడద నివారణకు ఏటా అక్షరాలా 2 లక్షల 40వేల రూపాయలు ఓ కాంట్రాక్టర్ కు చెల్లిస్తున్నారట. సరే విలువైన పత్రాలు ఉంటాయి కాబట్టి.. ఈ చర్య తప్పదు కదా అని అనుకోవద్దు. ఇక్కడే ఉంది అసలు తిరకాసు. అసలు ఎలుకల బెడద తప్పించడానికి సదరు కాంట్రాక్టర్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మూషికాలు మొత్తం భవనాన్నే తమ ఇష్టారాజ్యంగా మార్చుకున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయట.

అది లేకుంటే హైదరాబాద్‌లో హోటళ్లకు నీళ్లు బంద్‌:జీహెచ్‌ఎంసీ కఠిన నిర్ణయంఅది లేకుంటే హైదరాబాద్‌లో హోటళ్లకు నీళ్లు బంద్‌:జీహెచ్‌ఎంసీ కఠిన నిర్ణయం

దాగుడుమూతల దగా.. పిల్లి వచ్చే గప్‌చుప్

దాగుడుమూతల దగా.. పిల్లి వచ్చే గప్‌చుప్

గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి ముఖ్యమైన పరిపాలన కార్యాలయం అది. అందుకుతగ్గట్లుగానే ఇక్కడ విలువైన దస్త్రాలు భద్రపరుస్తారు. వీటిని ఎలుకల బారి నుంచి కాపాడాలనేది అధికారుల ప్రయత్నం. దీంతో ఓ కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. ఏటా 2 లక్షల 40వేల రూపాయల బిల్లు కూడా చెల్లిస్తున్నారు. అంటే ఎలుకలను పట్టుకోవడానికి నెలకు 20వేల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. పోనీ అంత ఖర్చుపెడుతున్నా.. సదరు కాంట్రాక్టర్ అందుకుతగ్గట్లుగా పనిచేస్తున్నారా అంటే అదీ లేదు. ఆయన ఎలుకలను పట్టుకోవడం ఏమో గానీ.. ఠంచనుగా బిల్లులు మాత్రం పట్టుకుపోతున్నారనే ఆరోపణలున్నాయి.

 ఎలుకలు ఏమోగానీ.. బిల్లులు మాత్రం పట్టుకెళుతున్నారు..!

ఎలుకలు ఏమోగానీ.. బిల్లులు మాత్రం పట్టుకెళుతున్నారు..!

ఎలుకల నుంచి దస్త్రాలు కాపాడటం ఏమో గానీ.. ప్రభుత్వ ఖజానాకు మాత్రం చిల్లు పడుతోంది. పాత భవనం కావడం, కాగితాలు ఎక్కువగా ఉండటంతో మూషికాలు తమ నివాసానికి దీన్ని రాజభవనంగా మలుచుకున్నట్లు తయారైంది పరిస్థితి. అది ఎంతలా అంటే మున్సిసల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కంటే ముందు అవే దర్శనమిస్తున్నాయి.

అదలావుంటే వీటి వేట కోసం వచ్చే పిల్లుల తంటా మరోవైపు. వెరసి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఎలుక-పిల్లి కథలా తయారయింది. నెలకు 20వేల రూపాయలు తీసుకుంటూ.. ఆ కాంట్రాక్టర్ ఎలుకల బెడద నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడంపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు భగ్గుమంటున్నారట. వాట్ ఇజ్ దిస్ అంటూ ప్రశ్నిస్తున్నారట. ఇప్పటికైనా ఆ ఎలుకల బెడద తీరేనా? ఆ కాంట్రాక్టరుకు ఇచ్చే లెక్కలు తేలేనా?

English summary
Hyderabad muncipal officials wasting money in lakhs in the name of rats. At a headquarters in Liberty Circle, the literally paying Rs 2 lakh to Rs 40,000 per year is to pay a contractor. However, allegations have been made that the contractor has not made any attempts to avoid the rat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X