హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సర్జికల్ స్ట్రైక్ చేస్తామని.. స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు.. బీజేపీ మేనిఫెస్టోలో పాతబస్తీకి భారీగా

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటిదాకా జరిగిన ప్రచారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన ''హైదరాబాద్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్..'' కామెంట్లు వివాదాస్పదంగా, హైలైట్‌గా నిలిచాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రోహింగ్యా, పాకిస్తానీ, బంగ్లాదేశీ ముస్లింలు అక్రమంగా ఆశ్రయం పొందుతున్నారని, వాళ్లకు ఓటు హక్కు కల్పించడం ద్వారా ఎంఐఎం ఫాయిదా పొందుతోందని ఆరోపిస్తూ.. బీజేపీ గనుక మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేసి విదేశీయుల్ని ఏరేస్తామన్న సంజయ్ వ్యాఖ్యలు జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశం అయ్యాయి. సీన్ కట్ చేస్తే..

అడ్డంగా దొరకిన బీజేపీ: కాపీ కొట్టడానికీ తెలివుండాలన్న కేటీఆర్ -కాషాయ మేనిఫెస్టోలో గులాబీ ఘనతఅడ్డంగా దొరకిన బీజేపీ: కాపీ కొట్టడానికీ తెలివుండాలన్న కేటీఆర్ -కాషాయ మేనిఫెస్టోలో గులాబీ ఘనత

రంగంలోకి కేంద్రం..

రంగంలోకి కేంద్రం..

బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలను ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితరులు ఖండించగా, శాంతి భద్రతలపై జరిపిన సమీక్షా సమావేశంలోనూ సీఎం కేసీఆర్ వాటిని పరోక్షంగా ప్రస్తావించారు. కొందు పనిగొట్టుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తున్నారని, లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. దీనికి కౌంటర్ గా కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం తమవద్ద ఉందని, కేసీఆర్ ప్రభుత్వం గనుక ఫిర్యాదు చేసే అప్పుడు కేంద్రం రగంలోకి దిగి రోహింగ్యాలను వెనక్కి పంపుతుందని చెప్పారు. కిషన్ రెడ్డి ప్రకటన కంటే ముందు..

 పాతబస్తీకి బీజేపీ వరాలు..

పాతబస్తీకి బీజేపీ వరాలు..

బల్దియా ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. బేగంపేటలోని తాజ్ వివంతా హోటల్ లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ గ్రేటర్ బీజేపీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనా దినోత్సవంగా నిర్వహిస్తామని చెప్పడంతోపాటు కరోనా వ్యాక్సిన్, ఎల్ఆర్ఎస్ రద్దు, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, జంక్షన్ కు ఒక ఫ్లై ఓవర్ తదితర హామీలెన్నో అందులో పొందుపర్చారు. అయితే, ఏ పాతబస్తీపైనైతే నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారో, అదే ప్రాంతానికి స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని బీజేపీ హామీ ఇవ్వడం గమనార్హం. ప్యాకేజీలో పాతబస్తీకి బీజేపీ అందిస్తామన్న వరాలు ఇలా ఉన్నాయి..

ఒక్కో డివిజన్‌కు రూ.4కోట్లు..

ఒక్కో డివిజన్‌కు రూ.4కోట్లు..

‘‘400 ఏళ్లుగా ఓల్డ్ సిటీ.. పాతబస్తీగానే ఉండిపోయింది. అక్కడున్న చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించడంతోపాటు బస్తీల అభివృద్ధికి ప్రత్యేక నిధులతో స్పెషల్ ప్యాకేజీ కేటాయిస్తాం. ఇప్పటికే ఉన్న డెవెలప్మెంట్ అథారిటీని సమర్థవంతంగా అమలు చేసి, పాతబస్తీని కూడా గ్రేటర్ మోడర్న్ బస్తీగా మారుస్తాం. అభివృద్ధిని ఒకే డివిజన్ కు పరిమితం చేయకుండా అన్ని డివిజన్లను సమానంగా చూస్తాం. ప్రతి డవిజన్ కు రూ.4కోట్లు తగ్గకుండా నిధులు కేటాయిస్తాం'' అని బీజేపీ తన మేనిఫెస్టోలో రాసుకొచ్చింది. ఓల్డ్ సిటీలో అధికంగా ఉండే ఆటో డ్రైవర్లను ఆకట్టుకునే క్రమంలో.. సొంత ఆటో కలిగిన ఒక్కో డ్రైవర్ కు రూ.7వేలు సాయం చేస్తామని, ప్రమాద బీమా కల్పిస్తామని కమలనాథులు హామీ ఇచ్చారు. అదే సమయంలో..

విద్యుత్ చౌర్యానికి చెక్..

విద్యుత్ చౌర్యానికి చెక్..

ఒకవైపు స్పెషల్ ప్యాకేజీని ప్రకటిస్తూనే, సంస్కరణ చర్యల్లో భాగంగా పాతబస్తీలో విద్యుత్ చౌర్యానికి అడ్డుకట్ట వేస్తామని కూడా బీజేపీ హామీ ఇచ్చింది. ‘‘ఓల్డ్ సిటీలో ఏడాదికి రూ.600 కోట్ల విలువైన విద్యుత్ చౌర్యం జరుగుతోంది. ఆ ఏరియాలో కేసులు పెట్టడానికి కూడా భయపడే ఈ ప్రభుత్వం తెలంగాణ భవితకు చాలా ప్రమాదకరం. పాతబస్తీ విద్యుత్ ఫీడర్లలో 85 శాతం నష్టాలు వస్తుంటే, సికింద్రాబాద్ లాంటిచోట నష్టాలు 12 శాతమే ఉన్నాయి. తద్వారా అక్కడ కరెంటు దొంగతనం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సొంత ప్రయోజనాల కోసం పాతబస్తీ విద్యుత్ చౌర్యాన్ని చూసిచూడనట్లు వదిలేసే ప్రభఉత్వం.. ఇతర ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదు చేసి, సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు పాత బస్తీలో విద్యుత్ చౌర్యానికి చెక్ పెడతాం'' అని బీజేపీ తన మేనిఫెస్టోలో రాసుకొచ్చింది.

తిరుపతిలో జగన్‌కు డ్యామేజ్ -జనం మాటిదే -వెంకయ్యతో తీవ్ర విభేదం: వైసీపీ ఎంపీతిరుపతిలో జగన్‌కు డ్యామేజ్ -జనం మాటిదే -వెంకయ్యతో తీవ్ర విభేదం: వైసీపీ ఎంపీ

English summary
amid telangana bjp chief bandi sanjay kumar's 'surgical strike on old hyderabad' threats, the bjp has promised a huge special package for old hyderabad in it's ghmc election manifesto. each division in old city will get atleast rs.4 crore package, says bjp in manifesto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X