హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌తో ఓవైసీ ఢీ:గ్రేటర్‌లో పొత్తులేదు -బీజేపీ నేతలకు నిద్రలోనూ నా పేరే -సిటీకి మోడీ ఏమిచ్చాడు?

|
Google Oneindia TeluguNews

''హైదరాబాదీలు టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే అది మతతత్వ ఎంఐఎంకు వేసినట్లే.. అదే నేరుగా ఎంఐఎంకు ఓటు వేస్తే, విభజన వాదానికి ఓటు వేసినట్లే.. నగరానికి నిరంకుశ ఎంఐఎం మేయర్ కావాలో, స్వచ్ఛంగా పాలించే బీజేపీ మేయర్ కావాలో ప్రజలే తేల్చుకోవాలి..'' అంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేసిన కామెంట్లపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఒకవైపు బీజేపీని ఏకిపారేస్తూ.. మరోవైపు టీఆర్ఎస్ తో పొత్తులేదని ఆయన స్పష్టం చేశారు.

పేద ముస్లింలకు ఓవైసీ చుక్కలు - కేసీఆర్ భారీ దోపిడీ -ఇవిగో సాక్ష్యాలు -కేంద్ర మంత్రి సంచలనంపేద ముస్లింలకు ఓవైసీ చుక్కలు - కేసీఆర్ భారీ దోపిడీ -ఇవిగో సాక్ష్యాలు -కేంద్ర మంత్రి సంచలనం

నిద్రలోనూ నాపేరే..

నిద్రలోనూ నాపేరే..

‘‘బీజేపీ నేతలను నిద్రలేపి కొన్ని పేర్లు చెప్పమంటే ముందుగా నన్నే తలుచుకుంటారు. ఆ వెంటనే ఉగ్రవాదం, దేశద్రోహం, పాకిస్తాన్ పేర్లను పలవరిస్తారు. అభివృద్ధి పరంగా బీజేపీ చేసిందేమీ లేదు కాబట్టి మతం పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోంది. నిరుద్యోగులైన యువకుల దృష్టి మళ్లించడానకే రాజ్యాంగ విరుద్ధమైన ‘లవ్ జీహాద్' లాంటి చట్టాలను తెస్తోంది'' అని ఓవైసీ ఫైరయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.

మోదీ చేసింది శూన్యం..

మోదీ చేసింది శూన్యం..

ఇటీవలి వరదలకు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైన మాట నిజమే అయినా, వరదలతో తల్లడిల్లిపోయిన నగర ప్రజలకు మోదీ సర్కారు చేసిందేమీ లేదని ఓవైసీ అన్నారు. హైదరాబాదుకు బీజేపీ ఏమీ చేయలేదు కాబట్టే ఇప్పుడు మతం పేరుతో ఓట్లు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎత్తులు ఇక్కడ పనిచేయవని, ఆ పార్టీ ఎంత ప్రమాదకారో నగర ప్రజలకు బాగా తెలుసన్నారు. అసలు తెలంగాణకుగానీ, హైదరాబాద్ నగరానికిగానీ ఏం మేలు చేశారో బీజేపీ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

భార్య సహా 17 మంది అమ్మాయిలను -ఆర్మీ మేజర్ ముసుగులో సంచలన క్రైమ్ - రూ.6కోట్లు స్వాహా

Recommended Video

GHMC Elections 2020 : అన్ని పార్టీల నజర్.. పాతబస్తీ, మజ్లిస్‌ను మట్టికరిపించడానికి బీజేపీ
టీఆర్ఎస్‌తో ఎంఐఎం ఢీ

టీఆర్ఎస్‌తో ఎంఐఎం ఢీ

అధికార టీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని ప్రచారం చేస్తోన్న బీజేపీ నేతలపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎంఐఎంకు టీఆర్ఎస్ తో పొత్తు లేదని, మజ్లిస్ పోటీచేస్తోన్న 52 కార్పొరేట్ డివిజన్లలో ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్సే అనే విషయాన్ని అందరూ గుర్తించాలని ఓవైసీ చెప్పారు. డిసెంబర్ 1న జరుగనున్న గ్రేటర్ ఎన్నికల్లో ఎప్పటిలాగే జనం బీజేపీని ఓడించబోతున్నారని ఓవైసీ వ్యాఖ్యానించారు.

English summary
Ahead of ghmc elections, AIMIM chief Asaduddin Owaisi slams bjp for making religious politics. speaking to media on sunday, Owaisi demands bjp to tell what center has done to hyderabad. Asaduddin also clarifies that AIMIM has no alliance with TRS in GHMC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X