హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శెభాష్ సంజయ్.. ఇదే జోరు ఎక్కడా తగ్గొద్దు: తెలంగాణ బీజేపీ చీఫ్‌కు ప్రధాని మోదీ ఫోన్ -రిగ్గింగ్

|
Google Oneindia TeluguNews

గతంలో టీడీపీకి జూనియర్ భాగస్వామిగా తెలంగాణలో అక్కడక్కడా మెరిసిన బీజేపీ.. రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటుతో చతికిలపడినా, నెలలు తిరిగే లోపే లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 4 ఎంపీ సీట్లు గెల్చుకుంది. అది కూడా కేసీఆర్ గుండెలాంటి కూతురు కవిత(నిజామాబాద్), కుడిచేయి లాంటి వినోద్ కుమార్(కరీనంనగర్)ను ఓడించి సత్తా చాటుకుంది. ఇటీవల దుబ్బక ఉప ఎన్నికల్లో గెలుపుతో గ్రేటర్ ఎన్నికల్లోనూ రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ పోరాడింది. ఇదిగో..

షాకింగ్: గ్రేటర్ ఓటరు సత్తా -పోలింగ్ శాతం పెరిగింది -20ఏళ్ల రికార్డు బ్రేక్ -చివరి గంటలో అనూహ్యంషాకింగ్: గ్రేటర్ ఓటరు సత్తా -పోలింగ్ శాతం పెరిగింది -20ఏళ్ల రికార్డు బ్రేక్ -చివరి గంటలో అనూహ్యం

బండికి మోదీ ఫోన్ కాల్..

బండికి మోదీ ఫోన్ కాల్..

వరుస పరిణామాలతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నిండుకోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలని, బీజేపీ విస్తరణ, ఎదుగుదల, కార్యకర్తలకు అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని తెలంగాణలో కాషాయ శ్రేణులకు ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సజయ్ తో ఫోన్లో మాట్లాడారు.

ఏపీలో మరో భారీ ప్రక్రియకు జగన్ సర్కారు ఆదేశాలు -ఈనెల 21 నుంచే -దేశంలో తొలిసారిగా..ఏపీలో మరో భారీ ప్రక్రియకు జగన్ సర్కారు ఆదేశాలు -ఈనెల 21 నుంచే -దేశంలో తొలిసారిగా..

గ్రేటర్‌లో బాగా పోరాడారు..

గ్రేటర్‌లో బాగా పోరాడారు..


ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 10 నిమిషాలపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌తో సంభాషించారు. ఈ విషయాన్ని పార్టీ, బండి అధికారికంగా వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సరళిపై, సిటీ సహా తెలంగాణ వ్యాప్తంగా పార్టీ పరిస్థితులపై సంజయ్ తో మోదీ ముచ్చటించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని మోదీ అభినందించారు. పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను ప్రధాని మోదీ కొనియాడారు. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరును కొనసాగించాలన్నారు. హైదరాబాద్, ఇతర జిల్లాల్లో బీజేపీ నాయకుల, కార్యకర్తలపై జరిగిన దాడుల వివరాలను కూడా ప్రధాని అడిగి తెలుసుకున్నారు. దేనికీ భయపడొద్దని, తాము అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చినట్లు పార్టీ తెలిపింది. మరోవైపు..

చివరి గంటలో భారీగా రిగ్గింగ్..

చివరి గంటలో భారీగా రిగ్గింగ్..

సాయంత్రం వరకు తక్కువగా ఉన్న పోలింగ్ శాతం.. ఫైనల్ లెక్కల్లో మాత్రం గతంలో కంటే పెరగడం, చివరి గంటలో ఏకంగా 10 శాతం ఓటింగ్ జరగడంపై తెలంగాణ బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓల్డ్ సిటీలోని పలు డివిజన్లలో ఎంఐఎం భారీ ఎత్తున రిగ్గింగ్ కు పాల్పడిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్ధసారథికి బుధవారం ఫిర్యాదు చేశారు. ఘాన్సీబజార్, పురానాపూల్‌లో రిగ్గింగ్ పై ఫిర్యాదు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని, పోలింగ్ బూత్‌లోకి స్థానిక ఎమ్మెల్యే వెళ్లినట్లు కూడా సమాచారం ఉందని, వీటిపై ఈసీ దర్యాప్తు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

English summary
prime minister narendra modi made phone call to telangana bjp chief bandi sanjay kumar on wednesday. amid ghmc elections, modi appreciates sanjay and telangana bjp efforts for the party success. modi also learned about attacks on bjp leaders in telangana. ghmc election results will be on december 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X