• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రేపు ఇలా జరిగితే బీజేపీదే గెలుపు -గ్రేటర్ పోలింగ్ వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

|

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం(డిసెంబర్ 1న) ఉద‌యం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు జ‌రిగే పోలింగ్‌ కోసం ఎన్నికల అధికారులు అంతా సిద్ధం చేశారు. మొత్తం 150 వార్డుల్లో 74.44 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఉండ‌గా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 1,122 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. ఎన్నికల్లో గెలుపుపై అన్ని పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్న క్రమంలో..

కరోనా విలయం: మళ్లీ లాక్ డౌన్? -4న ప్రధాని మోదీ కీలక సమావేశం -అన్ని పార్టీలకు పిలుపు

పిలవకున్నా వచ్చేయండి..

పిలవకున్నా వచ్చేయండి..

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ఇంకొద్ది గంటల్లో ప్రారంభం కానుండగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ కీలక సందేశమిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తిమంతమైనదని గుర్తుచేసిన ఆయన.. మంగళవారం నగరంలోని ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. పార్టీల నేతలు ఆయా ఇళ్లకు వెళ్లి పిలిచినా, పిలవకున్నా, ప్రజలంతా పెద్ద మనసుతో పోలింగ్ కేంద్రాలకు రావాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి, కుటుంబ పాలనను, అవినీతి రాజకీయాలను ఓడించేలా ఓటర్లు పెద్ద ఎత్తున ప్రక్రియలో పాల్గొనాలన్నారు..

జగన్ పెద్ద ఫేక్ సీఎం -గాలికే పోతాడు -నన్ను చంపేస్తాడా? జీవితంలో తొలిసారి: చంద్రబాబు సంచలనం

అలా జరిగితే బీజేపీదే గెలుపు

అలా జరిగితే బీజేపీదే గెలుపు

తెలంగాణలో కుటుంబ పాలన పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని కేంద్ర మంత్రి చెప్పారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ఎక్కడికి వెళ్లినా జనం నుంచి అపూర్వ స్పందన వచ్చిందని, అసలు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకోవడంలేదనే విషయం స్పస్టంగా అర్థమైందని తెలిపారు. పోలింగ్ రోజున హైదరాబాద్ లోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటే గనుక బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు..

ఊరూరా బీజేపీ పోరు..

ఊరూరా బీజేపీ పోరు..

తెలంగాణకు కేసీఆర్ గానీ, కల్వకుంట్ల కుటుంబం కానీ శాశ్వతం కాబోదని, ఇప్పటికే టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని కిషన్ రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిపిన సభలో.. సీఎం కేసీఆర్ ముఖంలో కళ కనిపించలేదని, ఆయన మాటల్లోనూ ఉత్సాహం లేదని మంత్రి గుర్తుచేశారు. దుబ్బాక, హైదరాబాద్‌ల నుంచి ఇకపై బీజేపీ పోరాటాన్ని ఊరూరా వ్యాప్తి చేస్తామన్నారు. ఇదిలా ఉంటే..

సిటీలో సెక్యూరిటీ టైట్..

సిటీలో సెక్యూరిటీ టైట్..

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సిటీలో భద్రతను కట్టుదిట్టం చేశామని, పోలింగ్ కు సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చర్యలు చేపట్టామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సోమవారం మీడియాకు తెలిపారు. ఎన్నిక‌ల్లో శాంతి భ‌ద్ర‌త‌ల నిర్వ‌హ‌ణ కోసం 52,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబ‌స్తు ఏర్పాటు చేయగా, సిటీకి చెందిన 13,500 మంది సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్‌ ఏజెంట్‌కు ప్రత్యేక అనుమతి ఉండదని, ఓటర్లను చట్టవిరుద్ధంగా తరలించడం నేరమని, అలా చేస్తే వాహనాలను సీజ్‌ చేస్తామని సజ్జనార్ హెచ్చరించారు.

English summary
ahead of ghmc polling, Union Minister Kishan Reddy confident of BJP victory. speaking to media on monday, kishan reddy said, if all the voters of Hyderabad come to vote bjp will secure win. minister also said that people were dissatisfied with the family rule in the state and that the KCR and Kalvakuntla family is not permanent for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X