హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బల్దియా రోడ్ల నిర్వహణ ఇక ప్రైవేట్ సంస్థలకు.. 709 కిమీ రోడ్లకు టెండర్లు...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తామని చెబుతోంది. దీంతో మహానగర గతుకుల రోడ్లు బాగవుతాయని ఆశిస్తోంది. తొలుత వర్క్ ఏజెన్సీలకు పనులు అప్పగిస్తామని సంకేతాలు ఇచ్చింది.

ప్రైవేట్ ఏజెన్సీలు ముఖ్యంగా గుంతలను పూడ్చివేస్తారు. దీంతోపాటు కొత్త రోడ్లను కూడా వేస్తారు. మరోవైపు లేయర్ల నిర్మాణానికి వేర్వేరు టెండర్లను కూడా స్వీకరిస్తారు. ఇదీ సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం కింద (సీఆర్ఎం) కింద పనులు చేస్తారు. వర్క్ ఏజెన్సీలకు ఐదేళ్లపాటు పనులను బాధ్యతను అప్పగిస్తారు. అయితే రోడ్ల పుట్ పాత్ మాత్రం తవ్వాలంటే ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. ఆరునెలల ముందే సమాచారం ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చట్టంలో పేర్కొంది. హైదరాబాద్ మహానగరంలో 709 కిలోమీటర్ల పరిధిలో రహదారులకు సంబంధించి టెండర్లు పిలువాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

ghmc roads maintenance Responsibility to agencies

మహానగర ప్రధాన రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. చినుకు పడితే చాలు చిత్తడయిపోతాయి. దీంతో నగరవాసి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దీనిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. వర్క్ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో నగర రహదారుల రూపురేఖలు మారతాయని ప్రభుత్వం భావిస్తోంది.

English summary
ghmc roads maintance Responsibility to agencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X