హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీహెచ్ఎంసీ వినూత్న అడుగు..! భవన నిర్మాణాలకు 15నిమిషాల్లో అనుమతులు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగర పాలక సంస్థ మరో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేయబోతోంది. భవన నిర్మాణాలకు సంబందించిన అనుమతులను సులభతరం చేసేందుకు కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీలో అమ‌లవుతున్న డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ ప‌ర్మిష‌న్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డి.పి.ఎం.ఎస్‌) విధానాన్ని సిటిజ‌న్ ఫ్రెండ్లీగా రూపొందించనున్నారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను సాఫ్ట్‌టెక్ సిద్ధం చేస్తోంది. సుల‌భ‌త‌ర పాల‌న విధానం (ఇ.ఓ.డి.బి)లో భాగంగా భ‌వ‌న నిర్మాణ రంగానికి సంబంధించిన సంపూర్ణ స‌మాచారాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఏవిధ‌మైన భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల‌కు ద‌ర‌ఖాస్తులు చేసినా వాటికి నియ‌మిత స‌మ‌యంలో అనుమ‌తులు ల‌భించేలా ఏక‌గ‌వాక్ష స‌మ‌గ్ర ఆన్‌లైన్ అనుమ‌తుల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నారు.

ఇంటి నుంచే ప్లాన్ కు ఆమోదం..! అప్రూవల్ తొలగనున్న అడ్డంకులు..!!

ఇంటి నుంచే ప్లాన్ కు ఆమోదం..! అప్రూవల్ తొలగనున్న అడ్డంకులు..!!

ప్రస్తుతం జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలో డి.పి.ఎం.ఎస్ విధానం అమ‌లులో ఉన్నప్పటికీ ఇది అధికారుల వ్యక్తిగ‌త నియంత్రణ‌లో ఉంది. పలు సందర్భాల్లో అనుమతులు ఇవ్వడానికి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్లో పారదర్శకత కోసం స‌ర్వీస్‌ల‌ను విధాన‌ప‌రంగా కేంద్రీకృతం చేయాల‌ని భావిస్తున్నారు. ఈ నూతన విధానం అమల్లోకి వస్తే ద‌ర‌ఖాస్తుల స‌బ్ మిష‌న్‌ నుంచి ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ల జారీ వ‌ర‌కు మొత్తం విధానాన్ని ఆన్‌లైన్ ద్వారానే చేయ‌నున్నారు. ప్రతిపాదిత ఆన్‌లైన్ విధానంలో ఖాళీ స్థలాల లేఅవుట్ ప‌ర్మిష‌న్లు, గ్రేటెడ్ క‌మ్యూనిటీల లేఅవుట్ ప‌ర్మిష‌న్లు, ఇత‌ర‌ ప్రభుత్వ శాఖ‌ల అనుమ‌తులు, నో అబ్జెక్షన్ స‌ర్టిఫికెట్ల జారీ త‌దిత‌ర అంశాల‌న్నింటినీ ఈ విధానంలో రూపొందించ‌నున్నారు.

ఆన్ లైన్ లో ధరఖాస్తులు..! వేగవంతమైన పరిశీలన..!!

ఆన్ లైన్ లో ధరఖాస్తులు..! వేగవంతమైన పరిశీలన..!!

భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల‌కు సంబంధించి రెసిడెన్షియ‌ల్‌, క‌మ‌ర్షియ‌ల్‌, ఇనిస్టిట్యూష‌న‌ల్‌, గ్రూప్ హౌసింగ్‌, లేఅవుట్ ప‌ర్మిష‌న్లకు సంబంధించి ఓపెన్ ప్లాట్లు, గ్రేటెడ్ క‌మ్యూనిటీ, గ్రూప్ హౌసింగ్‌ల‌కు అనుమ‌తులు, నో అబ్జెక్షన్ స‌ర్టిఫికెట్ల జారీకి సంబంధించిన సందేహాలు, భూ బ‌ద‌లాయింపు త‌దిత‌ర అంశాల‌ను కూడా ఈ విధానంలో పొందుప‌రచనున్నారు. సిటిజ‌న్ లేదా ఆర్కిటెక్ట్ ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లోనే పంపాల్సి ఉంటుంది. ఈ ద‌ర‌ఖాస్తుల‌ను క్లౌడ్ బేస్‌డ్ వ‌ర్క్ ఫ్లో ద్వారా జీహెచ్ఎంసీ టౌన్‌ ప్లానింగ్ అధికారులు ప‌రిశీలిస్తారు. మాస్టర్ ప్లాన్, టెక్నిక‌ల్‌, లీగ‌ల్‌, సైట్ ఇన్స్పెక్షన్ త‌దిత‌ర అంశాల‌ను ఈ క్లౌడ్ ఆధారిత విధానం ద్వారానే ప‌రిశీలిస్తారు.

కీలకం కానున్న డిజిటల్ సిగ్నేచర్..! అంతా కంప్యూటరీకరణే..!!

కీలకం కానున్న డిజిటల్ సిగ్నేచర్..! అంతా కంప్యూటరీకరణే..!!

అనంత‌రం ఈ అనుమ‌తుల ద‌ర‌ఖాస్తులు వెబ్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఆటో డి.సి.ఆర్ డ్రాయింగ్‌ల ద్వారా ప‌రిశీలించి 15 నిమిషాల్లోనే అనుమ‌తులు స‌క్రమంగా ఉన్నాయా లేదా డివియేష‌న్లు ఉన్నాయా అనే అంశంపై స‌మ‌గ్ర నివేదిక‌ను సిస్టమ్ అంద‌జేస్తుంది. క్షేత్రస్థాయి ప‌రిశీల‌న‌ను కూడా మొబైల్ యాప్ ఆధారితంగానే ఉంటుంది. అనుమ‌తుల‌న్నింటిని సిటిజ‌న్లకు డిజిట‌ల్ సిగ్నేచ‌ర్ ద్వారానే అంద‌జేస్తారు. అనుమ‌తుల‌కు సంబంధిచిన ఫైళ్ల వివ‌రాలు ఆటోమెటిక్‌గానే వెబ్‌సైట్‌, ఎస్‌.ఎం.ఎస్‌, ఈ-మెయిల్‌, వ్యక్తిగ‌త మొబైల్ యాప్‌ల‌లోకి అప్‌డేట్ అవుతాయి. అనుమతుల‌కు సంబంధించిన చెల్లింపులు కూడా ఇంటిగ్రేటెడ్ పేమెంట్ గేట్‌-వే ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

సిటిజ‌న్ ఫ్రెండ్లీగా నగర పాలక సంస్థ సేవలు..! చెన్నై తరహాలో సాంకేతికత..!!

సిటిజ‌న్ ఫ్రెండ్లీగా నగర పాలక సంస్థ సేవలు..! చెన్నై తరహాలో సాంకేతికత..!!

సిటిజ‌న్ ఫ్రెండ్లీగా ఉండేందుకు చేప‌ట్టనున్న అనుమ‌తుల విధానంపై న‌గ‌ర‌వాసులు, ముఖ్యంగా బిల్డర్లు, వ్యక్తిగ‌త భ‌వ‌న నిర్మాణ‌దారుల‌కు ఫిబ్రవరిలో అవ‌గాహ‌న కార్యక్రమాలను చేప‌ట్టారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏటా వివిధ కేట‌గిరిల‌కు సంబంధించిన 16,000 భ‌వ‌న నిర్మాణ అనుమ‌తు లు జీహెచ్ఎంసీ జారీ చేస్తోంది. వీటిలో దాదాపు 13 వేల ద‌ర‌ఖాస్తులు ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణ అనుమ‌తుల‌కు అందుతున్నాయి. ఈ నూతన విధానంతో పారదర్శకత సాధించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్ని గజాల్లో ఇల్లు నిర్మిస్తారనే విషయం పై ఆధారపడి కూడా ఆన్ లైన్ పొందుపరచనున్నారు. చెన్నై నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చేలా కసరత్తు సాగుతోందని టౌన్ ప్లానింగ్ లోని ఓ ముఖ్య అధికారి వెల్లడించారు.

English summary
The development of the Permission Management System (DPMS) in GHMC is designed to be a Citizen Friendly. Saftech is preparing technical specifications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X