వాడి వేడిగా జీహెచ్ఎంసీ రెండవ స్టాండింగ్ కమిటీ సమావేశం.! 9అంశాలు కమిటీ ఆమోదం.!
హైదరాబాద్ : జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ రెండో సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. హౌసింగ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ద్వారా న్యాక్ ఇంజనీర్ల నియామకంలో రిజర్వేషన్ ప్రకారంగా నియమించడం జరిగింది. సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మేయర్ సమాధానం ఇచ్చారు. పాత బస్తీ యువతకు ఉపాధి కల్పించేందుకు అవకాశాలు మెరుగు పరచాలని, పాత బస్తీలో కూడా న్యాక్ ద్వారా శిక్షణ పొందుతున్నారని సభ్యులు మేయర్ కు సూచించారు.

ఓల్డ్ సిటీ యువతకు చేయూత.. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం..
శిక్షణ పొందిన వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏంఐఎం సభ్యులు కోరగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన న్యాక్ సెంటర్ ను రిజర్వేషన్ ప్రకారం గా కోరడం జరుగుతుందని,రిజర్వేషన్ ప్రకారంగా మెరిట్ గల వారిని ఎంపిక చేసి పంపిస్తారని, సుమారు 200 ఇంజనీరింగ్ పర్మినెంట్ పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఔట్ సోర్సింగ్ నియామకం అవసరం ఏర్పడినట్లు ఇంజనీర్ ఇన్ చీఫ్ జియాఉద్దీన్ వివరణ ఇచ్చారు. ఖాళీగా ఉన్న స్వీపర్ పోస్టులను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా నియమించాలని మేయర్ అధికారులను కోరారు.

ఖాళీగా ఉన్న స్వీపర్ పోస్టులను భర్తీ చేయాలి.. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం రిక్రూట్ మెంట్ అన్న మేయర్
శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ స్విపర్ హాజరు పరిస్థితి సరిగా నమోదు చేయడం లేదని, ఎప్పటికప్పుడు కార్పొరేటర్లు పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, 15 మంది సభ్యులకు గాను 12 మంది సభ్యులు హాజరయ్యారు.మల్లాపూర్ కార్పొరేటర్ పి.దేవేందర్ రెడ్డి, మహమ్మద్ అబ్దుల్ సలాం సాహిద్ చావని, శ్రీమతి మహపార కుర్మగూడ, మిర్జా ముస్తఫా బేగ్ రియాసత్ నగర్, శ్రీమతి పర్వీన్ సుల్తాన ఘన్సీ బజార్,మందగిరి స్వామి కార్వాన్, శ్రీమతి బాత జబీన్ విజయనగర్, ఇ.విజయ్ కుమార్ గౌడ్ అంబర్ పేట్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ షేక్ పేట్, సి.ఎన్.రెడ్డి రహమత్ నగర్, వై.ప్రేమ్ కుమార్ ఈస్ట్ ఆనంద్ బాగ్, సామల హేమ సీతాఫల్ మండి నుండి పాల్గొన్నారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్ ఒక సంవత్సరం పొడిగింపు..రిటైర్మెంట్ ఉద్యోగులకు గ్రాట్యుటీ
హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఔట్ సోర్సింగ్ ద్వారా (124+126) 250 ఉద్యోగుల సర్వీస్ ఒక సంవత్సరం పొడిగింపుతో పాటుగా నూతన ఏజెన్సీతో ఒప్పందానికి ఆమోదం స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. రిటైర్మెంట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి పెంచిన గ్రాట్యుటీ 12 లక్షల నుండి 16 లక్ష వరకు చెల్లించేందుకు ఆమోదం లభించింది. పే రివిజన్ ప్రకారంగా సర్వీస్, ఫ్యామిలీ పెన్షనర్స్ కి వేతనం పెంచేందుకు నిర్ణయాన్ని ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ప్రకటిస్తామన్నారు. బేగంపేట్ 30 సర్కిల్ లో 590 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ స్థలాన్ని మార్చబోతున్నారు.

మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం.. పలు ప్రాంతాల్లో వేగవంతంగా నిర్మాణం
పాత పాటిగడ్డ నల్ల పోచమ్మ టెంపుల్ వద్ద ఆర్ బి ఓపెన్ స్థలం నుండి ఆర్ అండ్ బి క్వాటర్ C119 వార్డు 149 బేగంపేట్ కు మార్చుటకు ఆమోదం లభించింది. ఖైరతాబాద్ జోన్ సర్కిల్ 17లో పంజాగుట్ట మోడల్ హౌస్ ద్వారకాపురి కాలనీ ఒక లేయర్ బి.టి/ సి సి రోడ్డు పునరుద్దరణ, ఫుట్ పాత్ నిర్మాణం కోసం 2.90 కోట్ల రూపాయల మంజూరుకు ఆమోదం లబించింది. ఉప్పుగూడ మహంకాళి టెంపుల్ వద్ద 496 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం మంజూరుకు ఆమోదం తెలిపారు. జంగం మెట్ డివిజన్ లో 496 లక్షల వ్యయంతో నిర్మించే మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కూడా మంజూరు చాసారు.