హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్: అతి భారీ హెచ్చరిక - అప్రమత్తంగా ఉండాలన్న లోకేశ్ - మూసీ ఒడ్డున మొసళ్ల కలకలం

|
Google Oneindia TeluguNews

గడిచిన 30 గంటలుగా విస్తారమైన వర్షాల కారణంగా చిగురుటాకులా వణుకుతోన్న విశ్వనగరం హైదరాబాద్ కు మరో భారీ హెచ్చరిక జారీ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గురువారం సాయంత్రం తరువాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూల్చివేత - మున్సిపల్ అధికారుల డేరింగ్ స్టెప్ - మంత్రి ఆదేశంతో దూకుడుఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూల్చివేత - మున్సిపల్ అధికారుల డేరింగ్ స్టెప్ - మంత్రి ఆదేశంతో దూకుడు

టోల్ ఫ్రీ నంబర్లు ఇవే..

టోల్ ఫ్రీ నంబర్లు ఇవే..

గురువారం రాత్రి వేళ నగరమంతటా అతి భారీ వర్షాలకుతోడు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. కాగా, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, డీఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు, అధికారులను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు జీహెచ్ఎంసీ టోల్‌ఫీ నంబర్లను 040-21111111, 040-29555500 సంప్రదించాలని సూచించారు.

చైనాతో టెన్షన్: తెరపైకి కొత్త అంశం -పెట్రోలింగ్‌పై ఆంటోనీ ప్రశ్నలు - వివరాలు చెప్పలేనన్న రక్షణమంత్రిచైనాతో టెన్షన్: తెరపైకి కొత్త అంశం -పెట్రోలింగ్‌పై ఆంటోనీ ప్రశ్నలు - వివరాలు చెప్పలేనన్న రక్షణమంత్రి

నిన్నటి కంటే ఇవాళ డేంజర్..

నిన్నటి కంటే ఇవాళ డేంజర్..

రాజధాని హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. ఉరుములు మెరుపులతో కుండపోతగా కురిసిన వర్షం.. బీభత్సం సృష్టించింది. రెండు గంటల వ్యవధిలోనే 10 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ వరదకాలువలను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. చాలా చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. ఫీర్జాదిగూడ చెరువు కట్టపై ఆలయం ప్రహరీగోడ కూలి.. బైక్‌పై పడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బుధవారం కురిసినదానికంటే గురువారం అతిభారీ వర్షం పడుతుందని అధికారులు హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యాయి. అయితే, అత్యవసర సేవలకు సిద్ధంగా ఉన్నామంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

బుధవారం సాయంత్రం వర్షం దంచికొట్టగా.. ఇవాళ (గురువారం) ఉద‌యం కూడా చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ కనిపించినా.. సాయంత్రానికి సిటీ మొత్తాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. బుధవారం కురిసిన వర్షానికి అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అతరాయం ఏర్పడింది. గురువారం రాత్రి కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యుత్ శాఖ అదికారులు సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే..

సిటీలో మొసళ్ల కలకలం..

సిటీలో మొసళ్ల కలకలం..

హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లోనూ రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీ నదిలోకి వరద వచ్చిచేరుతోంది. ఈ క్రమంలోనే బహదూర్ పురా ప్రాంతంలో మూసీ ఒడ్డున మొసళ్లు కనిపించడంతో కలకలం రేగింది. పురానాపూల్ వంతెనకు సమీపంలో మొసళ్లను గుర్తించిన స్థానికులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. వన్యప్రాణి సంరక్షణ సిబ్బందితో కలిసి పోలీసులు, నెహ్రూ జూపార్క్‌ సిబ్బంది సంఘటనా స్థలాలకు వచ్చి మొసళ్లను బంధించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అవి నీటిలోకి జారుకోగా, సిబ్బంది తమ ప్రయత్నం కొనసాగిస్తున్నారు. బహుశా ఈ మొసళ్లు హిమాయత్‌ సాగర్‌ నుంచి వరద నీటిలో ఈదుకుంటూ వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తన్నారు.

English summary
GHMC commissioner lokesh kumar warns city people on heavy rains on thursday. Panic gripped Bahadurpura and its surroundings in the south of the city after a crocodile was spotted on the banks of the Musi River on Thursday afternoon. A local resident noticed the crocodile resting on the sides of the river and alerted the local police patrol about it. The police personnel immediately alerted the forest department authorities who rushed a team to the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X