హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

27 శాతం ఐఆర్ ప్రకటించండి, ప్రభుత్వానికి రామచంద్రరావు డిమాండ్..

|
Google Oneindia TeluguNews

ఉద్యోగుల జీతాల పెంపుపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్ష నేతలు కూడా గత కొద్దీ రోజులుగా ఉన్న డిమాండ్‌ను లేవనెత్తుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చే లోపే.. సీఎం కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని కోరారు.

ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని కోరారు. పీఆర్సీ ఆలస్యమైతే.. వెంటనే ఐఆర్ ఇవ్వాలని రామచంద్రరావు కోరారు. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మూడు డీఏలు ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఒక్క డీఏ మాత్రమే ఇచ్చిందని గుర్తుచేశారు. మరీ మిగతా రెండు డీఏల సంగతి ఏంటీ అని అడిగారు. ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. యూనివర్సిటీలకు వీసీలు, ప్రొఫెసర్లను నియంచాలని కోరారు.

give 27 per cent ir to empolyees: ramachandra rao

భార్యాభర్తలు ఒకే చోట ఉద్యోగం చేసేలా బదిలీలు చేస్తామని ముఖ్యమంత్రి మాట తప్పారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు. ఈ హామీ కోసం ఉద్యోగులు వేచి చూస్తున్నారని తెలిపారు. వెంటనే బదిలీలు చేపట్టాలని.. దీంతో దంపతులకు మేలు జరుగుతుందని వివరించారు. దీంతో ఉద్యోగ సంఘాలు హర్షిస్తాయని తెలిపారు.

English summary
give 27 per cent ir to empolyees bjp mlc ramachandra rao demand to government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X