హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత....!

|
Google Oneindia TeluguNews

శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్‌ చేస్తున్న మరో ముఠా పట్టుబడింది. ఇటివల డీఆర్ఐ అధికారులు దాడులను పెంచడంతో పాటు బంగారం స్మగ్లింగ్‌పై దృష్టి సారించింది. దీంతో శంషాబాద్ వేదికగా జరుగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అధికారుల నిఘాలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది.

బంగారం తోపాటు అక్రమంగా బంగారం తీసుకొస్తున్న ఇద్దరు విదేశీలయును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు . అనంతరం ముఠా నుండి 14 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు 14 కోట్ల 46 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Gold caught in Shamshabad airport

కాగా దుబాయ్ నుండి వచ్చిన విమానంలో స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు.... బంగారం బిస్కెట్లను బ్లాక్ కలర్ టేప్‌తో చుట్టి విమానం సీట్ల కింద దాచిపెట్టి రవాణా చేస్తున్నట్టు వారు గుర్తించారు.. ఇక అరెస్టైన వారిలో ఒకరు సౌత్ కొరియాకు చెందిన వాడు కాగా , మరొకరు చైనాకు చెందిన పౌరుడని అధికారులు వెల్లడించారు. బంగారం అక్రమ రవాణాలో విమాన సిబ్బంది పాత్రపై అనుమానాలు కూడ డిఆర్ఐ అధికారులు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
Another gold smuggling gang caught in Shamshabad airport.14 kg of gold was seized by DRI Officials It value around Rs 14 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X