హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్ న్యూస్

|
Google Oneindia TeluguNews

ఆధునిక సమాజంలో కులాల పట్టింపులు, మతాల కుమ్ములాటలు ఓ వైపు సాగుతున్నా... మరోవైపు అదే స్థాయిలో యువతి, యువకులు కులాంతర వివాహాల వైపు అంతే స్థాయిలో మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వం సైతం వారిని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికిస్తున్న ప్రోత్సాహాక బహుమానాన్ని కూడ ప్రస్తుతం ఇస్తున్న దానికంటే ఐదు రెట్లు పెంచింది. ఇది నవంబర్ నుండి ఇది అమల్లోకి రానుంది.

కులాంతర వివాహాల కోసం ముందుకు వస్తున్న యువత

కులాంతర వివాహాల కోసం ముందుకు వస్తున్న యువత

సమాజంలోని అంతరాలను తగ్గించేందుకు కులాంతర వివాహాలు చాలా దోహదం చేస్తాయి.. ఇందుకోసం ప్రభుత్వాలు అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నా... దీంతో యువత సైతం ధైర్యంగా ముందుకు వస్తున్నారు. అయితే అక్కడక్కడ కోంత ఇవి వికటిస్తున్నాయి... సాధరణంగా కులంతార వివాహాలు చేసుకున్నవారు ఇంట్లో తల్లిదండ్రులను, ఇతర కుటుంబసభ్యులను ఎదిరించి బయటకు వస్తున్నారు. అనంతరం ఆర్ధిక ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీంతో వివాహాలు చేసుకునేందుకు కొంత వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

వివాహాఅనంతరం అనేక ఇబ్బందులు

వివాహాఅనంతరం అనేక ఇబ్బందులు

వివాహ అనంతరం కొంత ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పట్టణాల్లో అయితే ఇలాంటీ వారికి పెద్దగా ఇబ్బంది లేకున్నా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి మరికొంత ఇబ్బందిగా మారింది. దీంతో ఉద్యోగాలు లేనివారు స్వయం ఉపాధి కోసం ఇతరులు లేదా స్నేహితులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఈ పరిణామాలపై యువతియువకులు నిరుత్సహాంగా ఉంటున్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రోత్సహాకాలు ఎటు సరిపోకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కొంత సహాయాన్ని పెంచాలని చాల రోజులుగా కోరుతున్నారు.

రెండున్నర లక్షల ప్రోత్సాహం

రెండున్నర లక్షల ప్రోత్సాహం

ప్రభుత్వం కులాంతర వివాహాలకు ఇస్తున్న ప్రోత్సహాకం గతంలో 50వేల రూపాయలు మాత్రమే ఉండేది. దీంతో కులాంతర వివాహాలు చేసుకుంటున్న యువత ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహాకం కంటే ఇటివల తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కళ్యాణ లక్ష్మి పథకంపై మొగ్గుచూపుతున్నట్టు గమనించారు. ప్రోత్సాహక బహుమతి 50వేల రుపాయాలు ఇస్తుంటే కళ్యాణలక్ష్మి పథకం క్రింద లక్షరుపాయలను ప్రభుత్వం ఇస్తుంది. దీంతో ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్న వారికి ఇటివలే రెండున్నర లక్షల రూపాయలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన జీవోను సైతం జారీ చేసింది.

సమాజంలోని మార్పులను అందిపుచ్చుకోని ప్రభుత్వాలు

సమాజంలోని మార్పులను అందిపుచ్చుకోని ప్రభుత్వాలు

అయితే ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలతో పాటు పలు రిజర్వేషన్లు కూడ కల్పించాలనే డిమాండ్‌ కూడ వారి నుండి వస్తుంది. సమాజంలోని కులం, మతం అనే అంతరాలు తొలగించేందుకు ఇలాంటీ వివాహాలే పరిష్కారమని స్వాతంత్ర్యం ముందునుండే అనేక మంది సంఘ సంస్కర్తలు వీటీని ప్రోత్సహించారు. అయితే మారుతున్న సమాజంలో యువతి యువకుల్లో మార్పులు వస్తున్నా...అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టడంల లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు కులాంతర వివాహాలపై సమీక్ష జరిపి సరైన ప్రోత్సాహాకాలు అందిస్తే సత్పలితాను అందించే అవకాశాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు..

English summary
Good news for Inter caste marriage couples.Incentives has been hiked the government. instead of 50 thousand rs 2.50 lakhs will be given.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X